ఎంజేపీ విద్యార్థి అదృశ్యం
హసన్‌పర్తి : హసన్‌పర్తి మండలం జయగిరి శివారులోని మహాత్మాజ్యోతిరావు పూలే గురుకులం నుంచి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటపర్తికి చెందిన నెలకొండ హేమంత్ జయగిరిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సహా విద్యార్థులతో కలిసి హాస్టల్‌లోనే నిద్రించాడు. ఉదయం కనిపించకపోడంతో పాఠశాల పరిసరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
గేట్ తాళం వేయలేదా? కిటికీ నుంచి దూకాడా?
పాఠశాల ప్రధాన గేట్ వద్ద నిరంతరం సెక్యూరిటీలు విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే విద్యార్థి పారిపోయిన సమయంలో గేట్‌కు తాళం వేసి లేదా? కిటికీ నుంచి దూకి పారిపోయాడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉండగా, పాఠశాలలోని పలు గదులకు కిటికీలు కూడా లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఐదేళ్లుగా ఆ పాఠశాల ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నప్పటికీ సరైన సౌకర్యాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పెట్టుబడి పేరుతో మహిళ మోసం?
● లక్నెపల్లిలో ఢిల్లీ పోలీసుల విచారణ
నర్సంపేట రూరల్ : కంపెనీలో పెట్టుబడి పేరుతో ఓ మహిళ మోసం చేసిందనే ఫిర్యాదు మేరకు ఆమె వివరాలు సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లికి వచ్చినట్లు తెలుస్తోంది. లక్నెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ చాలా సంవత్సరాల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుని ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. అక్కడే ఓ పబ్‌తోపాటు ఓ కంపెనీ నెలకొల్పిందని సమాచారం. ఈక్రమంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సదరు మహిళ ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అనంతరం సదరు వ్యక్తి కంపెనీ లావాదేవీలపై ఆ మహిళకు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అతడు ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ మహిళ అడ్రస్ మేరకు ఢిల్లీ పోలీసులు నర్సంపేట మండలం లక్నెపల్లికి చేరుకుని విచారించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పంట కొని డబ్బు ఇవ్వకుండా బెదిరింపులు..
● అడ్తి యజమాని, గుమాస్తాపై కేసు నమోదు
వరంగల్: రైతు వద్ద పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన అడ్తి దుకాణం యజమాని ఆవుల ప్రభాకర్, గుమాస్తా తిప్పని రాజుపై కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన రైతు తోటకూరి ఉపేందర్‌రావు 2025 నవంబర్‌లో తన 27.65 క్వింటాళ్ల పత్తిని వరంగల్ ఏనుమముల మార్కెట్‌కి తీసుకు రాగా క్వింటాకు రూ.5,600 చొప్పున షాపు నంబర్ 03 వ్యాపారులు ఆవుల ప్రభాకర్, తిప్పని రాజు కొనుగోలు చేశారు. సరుకుకు మొత్తం రూ.1,54,840 రాగా అందులో ఖర్చులు తీసివేయగా రూ.1,47,400 ఇవ్వాల్సి ఉంది. అందులో 93,900 ఇచ్చి మిగతా రూ.53,500 తర్వాత ఇస్తామని పంపించారు. అడిగిన ప్రతీసారి కాలయాపన చేస్తూ చివరకు డబ్బులు ఇచ్చేదే లేదని, ఎవరికై నా చెప్పుకో అని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఖమ్మం నుంచి వచ్చి మా దగ్గర వసూలు చేసే ధైర్యం నీకు లేదని, డబ్బులు అడిగితే చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధిత రైతు ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో షాపు నంబర్ 03 వ్యాపారులు ఆవుల ప్రభాకర్, తిప్పని రాజుపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సురేశ్ తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు
ఖిలా వరంగల్: బంధువులతో తరచూ గొ డవల కారణంగా జీవితంపై విరక్తి చెంది వ రంగల్ అండర్‌బ్రిడ్జి ప్రాంతంలో రైల్వే ట్రా క్‌పై ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఇంతేజార్ గంజ్ పీఎస్‌కు చెందిన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుళ్లు మాట్ల రాజయ్య, కృష్ణ కాపాడారు. వరంగల్ కొత్తవాడకు చెందిన లోకబోయిన శారదకు సమీప బంధువులతో తరచూ జరుగుతున్నాయి. దీంతో జీవి తంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై సమాచారం అందుకున్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆమెను కాపాడారు. అనంతరం పీఎస్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రాత్రి హాస్టల్ నుంచి పరారయ్యాడా?
విద్యార్థి కోసం గాలింపు.. లభించని ఆచూకీ
పీఎస్‌లో ఫిర్యాదు..కేసు నమోదు


