నేడు పరీక్షా పే చర్చా
విద్యారణ్యపురి: తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షా పే చర్చా కార్యక్రమానికి (చర్చా పీపీసీ 2026) సంబంధించి హనుమకొండ జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్‌ఎంలను హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ ఆదివారం ఆదేశించారు. ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లోని (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ (ఐఎఫ్‌టీ)ల ద్వారా విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ సూచించారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఈకార్యక్రమాన్ని వీక్షించేలా అవగాహన కల్పించాలని, వీక్షించిన విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు నిర్దేశితఫారంలో సేకరించి మధ్యాహ్నం 2 గంటల్లోపు రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ సూచించిన మెయిల్‌కు పంపాలన్నారు. పరీక్ష పే చర్చా కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం ప్రేరణ పెంపొందించడమే లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు.
పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలి : డీఈఓ గిరిరాజ్‌గౌడ్


