జంప్‌జిలానీ..! | - | Sakshi
Sakshi News home page

జంప్‌జిలానీ..!

Feb 5 2026 7:09 AM | Updated on Feb 5 2026 7:09 AM

జంప్‌జిలానీ..!

జంప్‌జిలానీ..!

బీజేపీకి షాక్‌ ఇచ్చిన ఆ పార్టీ అభ్యర్థి

మాజీ ఎమ్మెల్యే చల్లా సమక్షంలో

బీఆర్‌ఎస్‌లో చేరిక

పరకాల: పరకాలలో బీజేపీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే మున్సిపాలిటీ 10, 14 వార్డులో బీజేపీ అభ్యర్థులు ఆకుల రమ్య, సిరంగి భాగ్యలక్ష్మి నామినేషన్‌ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. 10వ వార్డు నుంచి అవకాశం లేకపోవడంతో 14వ వార్డు నుంచి బొల్లెడ్ల సుష్మకు అవకాశం కల్పించింది. అయితే ఆమె.. ఆ పార్టీకి షాక్‌ ఇస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సుష్మ చేరికను బీజేపీ నేతలు ఖండించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా తమ అభ్యర్థిని కొనుగోలు చేశారని బీజేపీ నేతలు పి.కాళీప్రసాద్‌రావు, సిరంగి సంతోష్‌కుమార్‌ మండిపడ్డారు. కాగా, జంప్‌జిలానీలతో పరకాల మున్సిపల్‌ ఎన్నికల వాతావరణం మరింత ఉద్రిక్తలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని స్థానికులు పేర్కొటున్నారు.

71 నుంచి 23 ఏళ్ల

యువ నాయకురాలి వరకు..

జనగామ మున్సిపల్‌ ఎన్నికల బరిలో

అనుభవజ్ఞులు, విద్యావంతులు

జనగామ: జనగామ మున్సిపల్‌ ఎన్నికల్లో వయసు, విద్య, అనుభవం కలిగిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1వ వార్డులో 71 ఏళ్ల మూడ్‌ లక్ష్మణ్‌ నాయక్‌ మరోసారి బరిలో నిలిచారు. గ్రాడ్యుయేటైన ఆయన గతంలో కౌన్సిలర్‌గా సేవలందించారు. 5వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గజవెల్లి ప్రతాప్‌, అలాగే టీఆర్‌ఏపీ నుంచి రిటైర్డ్‌ టీచర్‌ రేణిగుంట్ల మురళి ఇద్దరూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు. 13వ వార్డులో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పానుగంటి సువార్త పోటీ చేస్తుండగా, అదే వార్డులో 24 ఏళ్ల మహమ్మద్‌ భాష అతి అత్కవ వయసు ఉన్న అభ్యర్థిగా బరిలో ఉండడం విశేషం. 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఎండి కాసిం, 15వ వార్డులో బీజేపీ అభ్యర్థి పెద్ది శశిధర్‌, 28వ వార్డులో బీఆర్‌ఎస్‌ తరఫున పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ హఫీజ్‌ ఫాతిమా, 29వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి, రిటైర్డ్‌ ఉద్యోగి మరుకుల శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. 16వ వార్డులో 23 ఏళ్ల అక్కల దేవి ఆకాంక్ష అతి చిన్న వయసు మహిళా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

అప్పడు భార్య .. ఇప్పుడు భర్త..

మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ..

వర్ధన్నపేట : గత ఎన్నికల్లో ము న్సిపాలిటీ 5వ వార్డు నుంచి బానోత్‌ అనిత గెలుపొందింది. ఈక్రమంలో ప్రస్తుతం 8వ వా ర్డు ఎస్టీ రిజర్వ్‌ కావడంతో ఆ మె భర్త శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కా గా, గత ఎన్నికల్లో ఒక్కో ఓటుతో గెలుపొందిన అని త కౌన్సిలర్‌గా అనేక సేవలు అందించారని, ప్రస్తు త ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాస్‌ ప్రచారం నిర్వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement