కేయూలో సైక్లింగ్ సెలక్షన్స్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు బుధవారం కేయూలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పలువురిని ఎంపిక చేశారు. ఈ ఎంపికలను రిజిస్ట్రార్ రామచంద్రం.. స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వెంకయ్యతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేష న్ కే యూ అధ్యక్షుడు జె. సోమన్న, వైస్ ప్రెసిడెంట్ రమేశ్, పీడీలు కిరణ్ గౌడ్, కిషన్, ఆంజనేయులు, మట్టెడ కుమార్, సుమన్ పాల్గొన్నారు.


