బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి

Feb 5 2026 7:09 AM | Updated on Feb 5 2026 7:09 AM

బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి

బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి

వరంగల్‌ ఎంపీ డా.కడియం కావ్య

హన్మకొండ: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. బుధవారం హనుమకొండ కనుకదుర్గ కాలనీలో మహిళ శిశు సంక్షేమ శాఖ, షేర్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన బాల్య వివాహాల అవగాహన ప్రచార రథాన్ని ఎంపీ కడియం కావ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యం అమూల్యమైన దశ అన్నారు. బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక–మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో షేర్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి, కోఆర్డినేటర్‌ శిరీష, వరంగల్‌ సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ వసుధ, సభ్యురాలు మధు, హనుమకొండ సీడబ్ల్యూసీ సభ్యుడు సుధాకర్‌, శ్రీకాంత్‌ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్లు జ్ఞానేశ్వరి, జగన్‌, చామంతి, జమున, ప్రశాంతి, కల్పన, ప్రభాకర్‌, గాయత్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement