మేడారంలో ట్రాఫిక్‌జామ్
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: తాడ్వా యి మీదుగా మేడారానికి భక్తులు ఆదివారం ప్రైవేట్ వాహనాల్లో భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వీఐపీ రోడ్డు నుంచి పార్కింగ్‌కు ప్రదేశాలకు వాహనాలను మళ్లీంచారు. ఒక్కసారిగా ఈ రోడ్డుకు వాహనాల తాకిడి పెరగడంతో వీఐపీ డైవర్షన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు. అదేవిధంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వైపు రావడంతో ఆరోడ్డు అంతా కిక్కిరిసిపోయింది. వాహనాలు సైతం అడవులు, పార్కింగ్‌ల్లో రద్దీగా కనిపించాయి. ప్రైవేట్ వాహనాలను గద్దెల సమీపంలోకి అనుమతించకుండా జంపన్నవాగు అవతల నార్లాపూర్ వరకు నిలిపివేశారు. తాడ్వాయి మీదుగా వచ్చే వాహనాలను కొంగలచెరువు వద్ద ఏర్పాటు చేసిన వీఐపీ పార్కింగ్ ప్రదేశానికి మళ్లించారు.


