ముగిసిన శ్రీధమ్ వేడుకలు
హసన్‌పర్తి: అన్నాసాగరంలోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన శ్రీధమ్–26 వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. విద్యార్థినులు వివిధ అంశాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ గా యకుడు కశ్యప్ బృంద ప్రదర్శనలు అలరింపజేశా యి. కశ్యప్ ఆటాపాటలు ఊర్రూతలుగించాయి. వరదారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవసరమన్నారు. తొ లుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ రెడ్డి, ప్రో గ్రాం కో–ఆర్డినేటర్ ఝాన్సి రాణి, ఆక్టర్ వేదిక, సు దర్శన్, కుమారస్వామి, ఎన్. శ్రీవాణి, డాక్టర్ ప్ర శాంత్,ఏవో వేణుగోపాలస్వామి పాల్గొన్నారు.


