ఇళ్లు కోల్పోతున్న వారిని ఆదుకునేందుకు సిద్ధం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: భద్రకాళి మాఢవీధుల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారిని ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలతో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ‘కుడా’, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇళ్లు కోల్పోతున్న వారు తమ అభిప్రాయాలు కలెక్టర్‌కు తెలిపి తమకు మరో చోట ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. మాఢవీధుల నిర్మాణ పనులకు సహకరిస్తున్నందుకు కాలనీవాసులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, మైనింగ్ ఏడీ రవిశంకర్, జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, కాలనీవాసులు పాల్గొన్నారు.


