రేపు కేయూలో మెగా జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు కేయూలో మెగా జాబ్‌ మేళా

Feb 6 2026 8:39 AM | Updated on Feb 6 2026 8:39 AM

రేపు

రేపు కేయూలో మెగా జాబ్‌ మేళా

రేపు కేయూలో మెగా జాబ్‌ మేళా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు వాయిదా క్యాంపస్‌లో స్టూడెంట్‌ సపోర్ట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు నేడు యూనివర్సిటీలో ఓరియంటేషన్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కేయూ ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చిర్రరాజు తెలిపారు. యూనివర్సిటీలోని ప్లేస్‌మెంట్‌ సెల్‌, హైదరాబాద్‌ మేజిక్‌ బస్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా సీఐఎస్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్‌ మేళాకు సంబంఽధించి గురువారం పోస్టర్లను కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం ఆవిష్కరించారు. ఈ మెగా జాబ్‌ మేళాకు 2023, 2024, 2025లో డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు, బీటెక్‌ కోర్సులు పూర్తి చేసిన వారు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్యులు బి.సురేశ్‌లాల్‌, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ మామిడాల ఇస్తారి, ప్రొఫెసర్‌ ఎస్‌.నర్సింహాచారి, స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య, ఇంజనీరింగ్‌ కళాశాల ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్లు సంతోశ్‌, బొల్లం కిరణ్‌, మేజిక్‌ బస్‌ ఫౌండేషన్‌ బాధ్యులు సందేశ్వర్‌, రాకేశ్‌ ల్యాదెల్ల పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ (సెల్ట్‌) ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన స్పోకెన్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ తరగతులు వాయిదా వేసినట్లు సెల్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మేఘనరావు తెలిపారు. ఈతరగతులు మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లుగా రీషెడ్యూల్‌ చేసినట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈస్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

చైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్‌ స్వర్ణలత

కేయూ క్యాంపస్‌: విద్యార్థులకు మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు కాకతీయ యూనివర్సిటీలో నూతనంగా స్టూడెంట్‌ సపోర్ట్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ రామచంద్రం ఒక సర్క్యూలర్‌ను గురువారం జారీ చేశారు. కేయూ స్టూడెంట్స్‌ కౌన్సిల్‌ కోసం చైర్‌పర్సన్‌గా సొషియాలజీ విభాగాధిపతి ఎం.స్వర్ణలత, సభ్యులుగా సైకాలజీ విభాగం అధ్యాపకులు సంపత్‌రెడ్డి, డాక్టర్‌ మాలతి, అకడమిక్‌ విభాగం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉన్నారు. వర్సిటీ క్యాంపస్‌ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలోని సైకాలజీ విభాగం వద్ద ఒక ఆఫీస్‌ ఏర్పాటు చేసి మానసిక సమస్యలతో బాధపడే కేయూ పరిధి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఫోన్‌లో కానీ, నేరుగా కానీ సంప్రదించవచ్చని సభ్యులు చెబుతున్నారు.

అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి

మానసిక ఆరోగ్య మద్దతు కోసం అవసరమైన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం అన్నారు. గురువారం కేయూలో స్టూడెంట్స్‌ సపోర్ట్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, సభ్యులతో వారు సమావేశం నిర్వహించారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్‌ టీహబ్‌ సంయుక్తంగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు క్యాంపస్‌లోని ఆడిటోరియంలో ఓరియంటేషన్‌ సెషన్‌ నిర్వహించనున్నట్లు రూసా కేయూ నోడల్‌ అధికారి ప్రొఫెసర్‌ మల్లికార్జున్‌ రెడ్డి, కేహబ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సవితాజ్యోత్స్న గురువారం తెలిపారు. ముఖ్యఅతిథిగా కేయూ వీసీ ప్రొఫెసర్‌ ప్ర తాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం, హైదరాబాద్‌ ఏఐసీ టీహబ్‌ ప్రతినిధులు రాజేష్‌కుమార శ్రవణ ఏర్ల, చైతన్య, మహ్మద్‌ హఫీజుద్దీన్‌ పాల్గొననున్నారని పేర్కొన్నారు.

రేపు కేయూలో  మెగా జాబ్‌ మేళా1
1/1

రేపు కేయూలో మెగా జాబ్‌ మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement