బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి
హన్మకొండ: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ డిమాండ్ చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌లో సబ్ ప్లాన్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి హామీని విస్మరించిందన్నారు. 2023 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సబ్ ప్లాన్ ప్రకటించడంతోపాటు బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్ల నిధులు కేటాయించా లని సూచించారు. సమావేశంలో ప్రొఫెసర్లు ఎం. సారంగపాణి, గోపు సుధాకర్, కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య, ఎంబీసీ నాయకుడు పాలడుగుల సురేందర్, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు, బీసీ నాయకులు ఎదునూరి రాజమొగిళి, దారబోయిన సతీశ్, ఎర్రబొజ్జు రమేశ్, డాక్టర్ కత్తెరశాల దామోదర్ పాల్గొన్నారు.


