ఉత్తమ డివిజన్‌గా హనుమకొండ టౌన్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ డివిజన్‌గా హనుమకొండ టౌన్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 16 సర్కిళ్లలో హనుమకొండ సర్కిల్‌లోని హనుమకొండ టౌన్ డివిజన్ 60.01 పాయింట్లతో ఉత్తమ డివిజన్లలో మొదటి స్థానం దక్కించుకుంది. ఇదే డివిజన్ పరిధిలో నయీంనగర్ సబ్‌డివిజన్ 65.71 పాయింట్లతో మొదటి స్థానం, హనుమకొండ సబ్ డివిజన్ 62.78 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కరీంనగర్ టౌన్ సబ్ డివిజన్ 63.84 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. అర్బన్ సెక్షన్ల విభాగంలో ఇదే డివిజన్‌లోని గోపాల్‌పూర్ సెక్షన్ 74.81 పాయింట్లతో ప్రథమ స్థానం దక్కించుకుంది. కాగా, సర్కిల్ విభాగంలో హనుమకొండ సర్కిల్ 48.58 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో పెద్దపల్లి సర్కిల్ 54.81 పాయింట్లతో మొదటి, జగిత్యాల 53,45 పాయింట్లతో ద్వితీయ, కరీంనగర్ 52.88 పాయింట్లతో తృతీయ, నిజామాబాద్ 45.18 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. అదే విధంగా సర్కిల్ స్థాయిలో హనుమకొండ సర్కిల్‌లోని మడికొండ సెక్షన్ 55.30 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో 67.21 పాయింట్లతో నక్కలగుట్ట ఉత్తమ సెక్షన్‌గా ఎంపికై ంది. ర్యాంకుల వారీగా చూసుకుంటే గోపాల్‌పూర్ ఏఈ మొదటి ర్యాంకు, నక్కలగుట్ట ఏఈ 7వ ర్యాంకు, సుబేదారి ఏఈ 11వ ర్యాంకు, యాదవనగర్ ఏఈ 14వ ర్యాంకు, హనుమకొండ చౌరస్తా ఏఈ 23, నిట్ ఏఈ 24వ ర్యాంకు పొందారు.
క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల అత్యుత్తమ సేవలతోనే టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్లలో ఉత్తమ డివిజన్లలో హనుమకొండ టౌన్ మొదటి స్థానంలో నిలిచింది. అంతరాయాలు లేని మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాం. సరఫరా మెరుగుకు అవసరమైన సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. డివిజన్‌లోనే అగ్రస్థానంలో నిలిపిన డివిజన్ ఉద్యోగులు, అధికారులకు అభినందనలు.
– జి.సాంబరెడ్డి, డీఈ, టీజీ ఎన్పీడీసీఎల్, హనుమకొండ టౌన్
ఉత్తమ డివిజన్‌గా హనుమకొండ టౌన్


