దుమ్మురేపిన డీజే నైట్
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం అన్నాసాగరంలోని ఎస్సార్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న స్పార్క్రిల్–26 వేడుకలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాన్ని పురస్కరించుకుని రెండో రోజు ఆదివారం వివిధ అంశాల్లో నిర్వహించిన సోలో, గ్రూప్ డ్యాన్స్‌తో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
స్టెప్పులేసిన విద్యార్థులు
ప్రత్యూష డీజే నైట్ కార్యక్రమం దుమ్మురేపింది. వేదికపై ప్రత్యూష బృందం ప్రదర్శన ఇస్తుండగా, వేదిక కింద విద్యార్థులు అనుసరిస్తూ స్టెప్పులేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌లో ఐటమ్స్ నోరూరించాయి. స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్లు ఎల్.రుషింద్రసాయి, ఎ.సంతోషినిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
నేడు ర్యాంప్‌వాక్
సోమవారం స్పార్క్రిల్–26 వేడుకలు ముగియనున్నాయి. కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరామచంద్ర బృందం ప్రదర్శన ఇవ్వనుంది. అదేవిధంగా కళాశాల విద్యార్థులు ర్యాంప్ వాక్ చేయనున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉల్లాసంగా ఉత్సాహంగా స్పార్క్రిల్ వేడుకలు
నేటితో ముగింపు
దుమ్మురేపిన డీజే నైట్
దుమ్మురేపిన డీజే నైట్


