నవ మేడారం
వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తం
కారడవిలో, వాగు వంకల నడుమ మొదలైన చిన్న జాతర.. ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తోంది. గూడెం ప్రజలు కొలిచిన ఆ సన్నిధి.. ప్రస్తుతం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మట్టి గద్దెల నుంచి విస్తృత సౌకర్యాల దాకా.. దిగబడే ఎగుడు దిగుడు రోడ్ల నుంచి డబుల్ బీటీ రోడ్డు దాకా.. ఎడ్ల బండ్ల ప్రయాణం నుంచి హెలికాప్టర్ దాకా మేడారంలో ఆధునికత సంతరించుకుంది. సెల్‌ఫోన్ టవర్లు, అత్యాధునిక సీసీ కెమెరాలు.. డ్రోన్లు ఒక్కటేమిటి వన మేడారం ఇప్పుడు నవ మేడారమైంది. – ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి
ప్రస్తుతం స్నానఘట్టాలు
గతంలో..
జాలితో ఉన్న శివసత్తులు
జంపన్నవాగులో..
సమ్మక్క–సారలమ్మగద్దెలు
క్యూలైన్లు
అడవిలో చిన్న గద్దెల వద్ద ప్రారంభమైన మేడారం జాతర నేడు దేశంలోనే ప్రఖ్యాత జాతరగా రూపుదిద్దుకుంది. గద్దెలు తప్ప శాశ్వత నిర్మాణాలు లేని స్థితి నుంచి నేడు విస్తృత సౌకర్యాలతో మేడారం రూపాంతరం చెందింది. అప్పుడు ఎడ్ల బండ్లు, గాటు రోడ్లు దుమ్ము ధూళితో ఉన్న మేడారానికి వారం రోజుల పాటు బస చేసేలా అడవిలో సరంజామాతో దిగేవారు. జాతర ముగిసే వరకు ఉండి పిల్లాపాపలతో అడవిలో ఆహ్లాదంగా గడిపేవారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నప్పటికీ అమ్మలపైనే భారం వేసేవారు. వారి కాలుకు ముల్లు కూడా అంటకుండా ఉండేది.
మట్టి రోడ్డు నుంచి జంట వంతెనల స్థాయికి..
మేడారం జాతరకు ఎడ్లబండలో జంపన్నవాగు దాటేందుకు నలుగురైదురుగు వెనక నుంచి నెడితేగానీ బండి ముందుకు కదిలే పరిస్థితి. కాలక్రమేణా జంట వంతెల నిర్మాణాలయ్యాయి. మారుమూల గ్రామాల భక్తులు ఆనవాయితీగా ఎండ్లబండ్లలో వస్తున్నప్పటికీ నేరుగా జంట వంతెనలను దాటి జాతరలోకి ప్రవేశిస్తున్నారు. జాతర సమయంలో జంపన్నవాగులో ఉన్న నీటితోనే స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకునే వారు. మారిన కాలానికి అనుగుణంగా వాగు ఒడ్డు వెంట స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసి వాగులో ఇన్‌ఫిల్టరేషన్ బావులను నిర్మించి నీటిని తోడి పోస్తున్నారు. జల్లుల స్నానాలను ఏర్పాటు చేశారు. ఎడ్లబండి, ట్రాక్టర్ల ద్వారా మేడారం చేరుకునేవారు. ఒకటి రెండు ట్రిప్పుల బస్సులు మాత్రమే మేడారం వచ్చేవి. వాటిద్వారా వచ్చే భక్తులు అరుదుగా ఉండేవారు. ఇప్పుడు ఐదు ఎకరాల్లో ఆర్టీసీ బస్టాండ్ విస్తరించింది. నాలుగు వేల బస్సులను ఈ జాతరకు రాష్ట్ర నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సర్వీసులను ఏర్పాటు చేశారు.
నాడు మట్టి గద్దెలు.. నేడు రాతి శిలలు
1950లో మట్టి గద్దెలతో ఉన్న అమ్మవారి గద్దెలను నేడు నానాటి అభివృద్ధి చెందుతూ వస్తోంది. మట్టి గద్దెలు, కంక వనాలు, జువ్వి చెట్టు నీడలోనే అమ్మవార్లను వేలాది మంది భక్తులు దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించేవారు. కానుకలను వేసేందుకు మట్టికుండలు, క్లాత్‌తో తయారు చేసిన హుండీలు ఉండేవి. వాటి స్థానంలో ఇప్పుడు ఐరన్, స్టీల్ హుండీలతోపాటు డిజిటల్ కానుకలు కూడా మొదలయ్యాయి.
ఒకప్పుడు గూడేలకే పరిమితమైన జాతర
తల్లుల ప్రాంగణానికి హైటెక్ హంగులు
భక్తుల సౌకర్యార్థం విస్తృత అభివృద్ధి
నవ మేడారం
నవ మేడారం


