ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: రొహతక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఈనెల 15న ప్రారంభమైన ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్‌క్రంటీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌కంట్రీ పురుషుల జట్టును స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య ప్రకటించారు. జె.రాఘవ, జె.రిషిక్, ఎం.అఖిల్, జె.అనిల్, జి.శివకుమార్, ఎండీ హబీబుద్దీన్ జట్టులో ఉన్నారని ఆయన తెలిపారు. ఈజట్టుకు కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.శ్రీధర్‌కుమార్ కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


