కేయూలో నేటినుంచి జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్: కేయూ పోలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు’ అనే అంశంపై ఈనెల 16, 17 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరెక్టర్, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. ఈనెల 16న ఉదయం 10 గంటలకు కేయూలోని సెనేట్ హాల్‌లో జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొననుండగా ప్రముఖ సామాజికవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు కంచ అయిలయ్య కీలకపోన్యాసం చేస్తారని తెలిపారు. వివిద చోట్ల నుంచి ప్రతినిధులు హాజరై పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య తెలిపారు.
నేడు గ్రాండ్ కల్చరల్ ఈవెంట్
కేయూ పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల16న రాత్రి 7గంటలకు గ్రాండ్ కల్చరల్ ఈవెంట్‌ను కేయూ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. నంది అవార్డు గ్రహీత, రైటర్ అండ్ సింగర్ మిట్టపెల్లి సురేందర్‌చే కల్చ రల్ ఈవెంట్ జరగనుందని నిర్వాహకులు తెలిపారు.


