పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శివయ్య అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నానని ఆమె పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం వరంగల్ శివనగర్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామలింగేశ్వరస్వామి, మధ్యకోటలోని స్వయంభు శ్రీశంభులింగేశ్వరస్వామిని మంత్రి సురేఖ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామశింగేశ్వరస్వామి, శంభులింగేశ్వరుడికి మంత్రి వేర్వేరుగా అభిషేకాలు, శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అంతకు ముందుగా వేదపండితులు ఆమెను పూర్ణకుంభంతో స్వాగతించారు. పూజారులు పట్టు వస్త్రాలు కప్పి ఆశీర్వదించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా శివలింగానికి అభిషేకించి పూజలు చేశానని తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, ఉమాదామోదర్, పండితుడు శంభులింగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు వొడ్నాల మల్లయ్య, శ్రీరాం రాజేశ్, మంచాల కృష్ణమూర్తి, శామంతుల శ్రీనివాస్, బోగి సురేఖ, ధర్శకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శివయ్య అనుగ్రహం వరంగల్ ప్రజలందరిపై ఉండాలి
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ


