లారీ కిందికి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరు యువకుల మృతి
మహబూబాబాద్ రూరల్ : బైక్ అదుపు తప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యు వకులు మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పాతదుబ్బ తండా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ధరావత్ మహేందర్ (20), బానోత్ వెంకటేష్ (20) అలియాస్ చంటి, బానోత్ శ్రీనివాస్.. బైక్‌కు సంబంధించిన ఫైనాన్స్ డబ్బులు చెల్లించడానికి జిల్లా కేంద్రానికి వచ్చారు. పని పూర్తయిన కొంత సమయానికి వాహనానికి సర్వీసింగ్ చేయించుకుని భోజనం చేయడానికి నర్సంపేట బైపాస్ వైపునకు వెళ్తున్నారు. వెంకటేష్ బైక్ నడుపుతుండగా శ్రీను, మహేందర్ వెనుక కూ ర్చున్నారు. ఈ క్రమంలో యశోద గార్డెన్స్ సమీపానికి చేరుకుంటుండగా పక్కనుంచి లారీ వెళ్తోంది. బైక్ అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్, శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యా యి. టౌన్ ఎస్సైలు ప్రశాంత్, షాకీర్, బ్లూకోల్ట్స్ పీసీ కుంజ రాంబాబు ఘటనాస్థలికి చేరుకుని 108లో క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా వెంకటేష్ మృతి చెందాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని సీఐ పేర్కొన్నారు.
పాతదుబ్బతండాలో విషాదం..
డోర్నకల్: మహబూబాబాద్‌లో జరిగిన రోడ్డు ప్ర మాదంలో డోర్నకల్ మండలం పాతదుబ్బతండా కు చెందిన మహేందర్(20), వెంకటేష్(20) మృతి చెందారు. దీంతో తండాలో విషాదం నెలకొంది. మహేందర్ తండ్రి శ్రీను ఆటోడ్రైవర్ కాగా వెంకటేష్ తండ్రి మోతీలాల్ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకే తండాకు చెందిన వీరు సమీప బంధువులు. కాగా, న లుగురు కూతుళ్ల తర్వాత జన్మంచిన వెంకటేష్‌ను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. ఈ క్ర మంలో వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడండంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.
లారీ కిందికి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరు యువకుల మృతి
లారీ కిందికి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరు యువకుల మృతి


