నేడు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు | - | Sakshi
Sakshi News home page

నేడు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు

Feb 3 2026 7:07 AM | Updated on Feb 3 2026 7:07 AM

నేడు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు

నేడు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు

కాజీపేట రూరల్‌ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్‌ మీదుగా కాన్పూర్‌ సెంట్రల్‌ –బెంగళూరు ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన కాన్పూర్‌లో బయలుదేరే కాన్పూర్‌ సెంట్రల్‌–బెంగళూరు (04005) ఎక్స్‌ప్రెస్‌ మరుసటి రోజు మంగళవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాగ్‌పూర్‌, బల్లార్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, కాజీపేట, కాచిగూడ, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌ సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement