ఆఫ్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ పనులకు శంకుస్థాపన
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో రూ సా నిధులతో పది కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులకు సోమవారం వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం శంకుస్థాపన చేశారు. ఈ పనులను రూసా నిధులు రూ. కోటి 52 లక్షల అంచనా వ్యయంతో బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా అమలు చేయబోతున్నట్లు వీసీ తెలిపారు. కార్యక్రమలో కేయూ పాలకమండలి సభ్యులు సుదర్శన్, బి. రమ, చిర్ర రాజు, కేయూ అభివృద్ధి అధికారి ఎన్. వాసుదేవరెడ్డి, యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, వెబ్‌సైట్ నెట్ వర్కింగ్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


