ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు
పరకాల: పరకాలలో పోలింగ్ ముగిసిన అనంతరం 5 రూట్లలోని 44 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సులను అధికారుల సమక్షంలో సాయంత్రం 5.30 గంటలకు సీల్ వేసి భారీ బందోబస్తుతో తరలించారు. పోలీస్ ఎస్కార్ట్‌తో గణపతి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. కౌంటింగ్ కూడా ఇదే కళాశాలలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాత్రి 7గంటల వరకు అన్ని బ్యాలెట్ బాక్సులను తరలించారు.
సాక్షిప్రతినిధి, వరంగల్ :
పుర పోరులో ఉమ్మడి వరంగల్ పట్టణవాసులు ఓట్లెత్తారు. ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9.30 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత 10 గంటల నుంచి ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులుదీరారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు అప్పుడప్పుడు లాఠీలు ఊపారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికల ఘట్టానికి తెరపడడంతో జిల్లాల ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం
ఉమ్మడి వరంగల్‌లో బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులుండగా.. ఏకగ్రీవమైన 18 మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలతో పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంకంటే 13.38 శాతం పెరిగింది.
స్ట్రాంగ్ రూముల్లో భవితవ్యం..
చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపాలిటీల వారిగా పోలింగ్ బాక్సులను ఒకేచోట చేర్చిన అధికారులు భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూములకు తరలించారు. మొత్తం బ్యాలెట్ పేపర్లతో కూడిన బాక్సులను మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. శుక్రవారం (13వ తేదీన) ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. కాగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద రెండు జిల్లాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుకు ఆదేశించారు. కాగా, స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉన్న ఓటర్లు తీర్పు ఎక్కడెక్కడ ఎవరిని వరిస్తుందోనన్న టెన్షన్ అభ్యర్థులో నెలకొంది. కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలు, నిర్వహించిన అధికారులకు కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు అభినందనలు తెలిపారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన
కలెక్టర్లు, అధికారులు
పోలీసు బందోబస్తు మధ్య
బ్యాలెట్ బాక్సుల తరలింపు
స్ట్రాంగ్‌రూముల్లో భద్రం...
రేపు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో


