డీజిల్ షెడ్డులో ఫిల్టరేషన్ ప్లాంట్ ప్రారంభం
ప్రారంభించిన రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్
కాజీపేట రూరల్: కాజీపేట డీజిల్ లోకో షెడ్‌లో ఆయిల్ ఫిల్టరేషన్ ప్లాంట్, ఒరాలింగ్ మిషన్ టెస్టింగ్ జనరేటర్‌ను బుధవారం సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) గోపాలకృష్ణన్ ప్రారంభించారు. అనంతరం డీఆర్‌ఎం ఇంటర్నల్ సెక్షన్లను తనిఖీ చేసి డీజిల్‌షెడ్ అభివృద్ధి, సమస్యలను స్థానిక రైల్వే షెడ్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కాజీపేట జంక్షన్ అమృత్ భారత్ పునరాభివృద్ధి పనులను డీఆర్‌ఎం తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు. డీఆర్‌ఎం వెంట సికింద్రాబాద్ ఏడీఆర్‌ఎం సంజీవరావు ఉన్నారు.
వినతి అందజేత
కాజీపేట డీజిల్ లోకో షెడ్డుకు వచ్చిన రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌ను రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్, డీజిల్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కె.జానీమియా, పాక వేదప్రకాశ్ సన్మానించి వినతిపత్రం అందించారు. షెడ్డులో మహిళా కార్మికుల కోసం వసతి గదులను నిర్మించాలని, డీజిల్‌షెడ్ నుంచి మెయిన్ రోడ్డు కళాతోరణం వరకు రోడ్డు మరమ్మతు చేయాలని, డీజిల్ కాలనీకి మిషన్ భగీరథ వాటర్‌ను సరఫరా చేయాలని, డీజిల్ ఇన్‌స్టిట్యూట్ కమ్యూనిటీ హాల్‌ను ఏసీగా ఆధునికీకరించాలని, లోకోలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 130 పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. డీఆర్‌ఎం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు జానీమియా తెలిపారు.


