మద్యం తాగి 11సార్లు చిక్కాడు..
● మద్యంప్రియుడికి నెలరోజుల జైలు
కాజీపేట/వరంగల్ క్రైం: మద్యం తాగి వాహనం న డుపుతూ 11వ దఫా పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఫాతిమా చిన్నప్ప 30 రోజులపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ పి.వెంకన్న తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన శివరాత్రి దేవయ్య మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబ డ్డాడు. దేవయ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చే యగా అప్పటికే 10 సార్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్టుగా రికార్డు అయ్యి ఉంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి దేవయ్యను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సదరు వ్యక్తికి 30 రోజులు జైలుశిక్ష విధించారు. మరో 14 మందికి జరిమానా విధించి వదిలేశారు.
విద్యార్థులకు విస్తృత అవకాశాలు
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ టీసీఎస్‌ఐఓఎన్ జాబ్ అచీవర్ బిజినెస్ అపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం విద్యార్థులకు విస్తృత అవకాశాలున్నాయని యూనివర్సిటీ కామ ర్స్ విభాగం ప్రొఫెసర్ అండ్ ఈఎంఆర్‌ఆర్‌సీ డైరెక్టర్ రబీంద్రనాథ్ అన్నారు. బుధవారం హనుమకొ ండలోని కేడీసీలో జాబ్ అచీవర్ బిజినెస్ ఆఫరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ వై .వెంకటేశ్వర్లు, కే డీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.


