చెస్ పోటీల్లో టీజీ ట్రాన్స్‌కోకు ద్వితీయ బహుమతి
హన్మకొండ: ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్‌లో టీజీ ట్రాన్స్‌కో ద్వితీయ బహుమతి కై వసం చేసుకుంది. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 47వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు చెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలంగాణ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మొదటి బహుమతి ఉత్తరప్రదేశ్, తృతీయ బహుమతి తమిళనాడు సాధించాయి. తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ మడికొండ ఏఈ ఎం.అనిల్ కుమార్ రెడ్డి, ఖమ్మం సర్కిల్‌లోని ఖమ్మం ఫోర్‌మెన్ ఎం.రత్నాకర్ రావు, టీజీ ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ వి.నర్సింహారావు, సికింద్రాబాద్ సర్కిల్ ఏఏఈ ఎం.మాధవ్ ప్రాతినిథ్యం వహించారు. ఐనవోలు ఏడీఈ పి.రాజిరెడ్డి మేనేజర్‌గా వ్యవహరించారు. విజేతలకు యూపీ పవర్ సెక్టార్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ జాన్ మథాయ్ బహుమతులు అందజేశారు.
ఆర్డీ పరేడ్‌కు ఎన్‌సీసీ కేడెట్లు
విద్యారణ్యపురి: ఢిల్లీలో ఈనెల 26న నిర్వహించనున్న రిపబ్లిక్ డే పరేడ్‌కు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ మహిళా కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్‌సీసీ కేడెట్లు హాజరవుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి తెలిపారు. 8వ గర్ల్స్ బెటాలియన్ నుంచి నలుగురు ఎన్‌సీసీ కేడెట్లు ఎంపిక కాగా.. అందులో ముగ్గురు కేడెట్లు వెంకటలక్ష్మి, త్రిష, భార్గవి పింగిళి కళాశాలకు చెందినవారని పేర్కొన్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపాలి
● ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
హన్మకొండ అర్బన్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారం, కుట్రలు ఆపాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పో లాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి అన్నారు. హనుమకొండ పోస్టల్ కాలనీలోని హనుమాన్ దేవాలయ ఆవరణలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉమ్మ డి జిల్లాల నాయకులతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ వి ద్యార్థులకు విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలకు వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ బ్యాక్‌లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి రూ.10 లక్షల ఆదాయ పరిమితి పెంచాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఓసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసీల మహా ధర్నాకు తరలిరావాలని ఆయన కోరారు. అనంతరం ధర్నా వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అంతకు ముందు మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావును కలిసి మహాధర్నాకు మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ఓసీ ఐకాస రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీశ్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లాల నాయకులు నల్లా రాజిరెడ్డి, చాడ జైహింద్ రెడ్డి, కోరెళ్ల సంజీవరెడ్డి, గంగిడి ప్రభాకర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, కామిడి శ్రీధర్‌రెడ్డి, గణపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.
చెస్ పోటీల్లో టీజీ ట్రాన్స్‌కోకు ద్వితీయ బహుమతి


