ఘనంగా నాగవెల్లి సదస్యం
హన్మకొండ కల్చరల్: వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామికి నాగవెల్లి సదస్యం నిర్వహించారు. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్, ప్రణవ్ ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి సూక్త మహా యాగం నిర్వహించారు. అనంతరం వేదస్వస్థితో రుద్రేశ్వరస్వామి రుద్రేశ్వరీ అమ్మవారికి నాగవెల్లి, నీలవేణి మహాలక్ష్మి గౌరీ పూజలు నిర్వహించారు. 11మంది వేదపండితులు వేదస్వస్తి పఠనం చేశారు. నాగవెల్లి కార్యక్రమంలో దాత వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి దంపతులు, మండువ శేషగిరిరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
నేడు అన్నపూజ..
మంగళవారం ఉదయం రుద్రేశ్వరస్వామికి అన్న పూజ నిర్వహించనున్నట్లు అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ జరుగుతుందని, అన్నపూజలో పాల్గొనేవారు రూ. 5,116 చెల్లించి రశీదు పొందవచ్చని ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో స్పార్క్ (స్కీమ్ ఫర్ ప్రమోషనల్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో నేషనల్ వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు ‘నానోథెరానోస్టిక్స్–2 ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ వైపు ఒక అడుగు’ అంశంతో నిర్వహించనున్న నేషనల్ వర్క్‌షాప్‌ను కెనడా యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా ప్రొఫెసర్లు సురేశ్ గడ్డె, లీషేంగ్ వాంగ్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడా రు. మారుతున్న కాలానుగుణంగా రోగి స్థితిని బట్టి పరిశోధనలతో ట్రాన్స్‌లేషన్ మెడిసిన్స్ తోడ్పడుతాయన్నారు. మెడిసిన్ రంగంలో నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు వేదికగా వర్క్‌షాప్ నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు శ్రీనివాసరావు, పీవీ.శ్రీలక్ష్మి, సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: సైబరాబాద్ కమిషనరేట్‌లో నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో, క్రీడా గ్రామంలో ఎగురవేసే వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడా పతకాన్ని సోమవారం సీపీ సన్‌ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, క్రీడాకారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు సీపీ చేతుల మీదుగా ట్రాక్ సూట్‌తో పాటు స్పోర్ట్స్ షూ, టీ షర్ట్ అందజేశారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ క్రీడాకారులు తమ సత్తా చూపాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నాగయ్య, ఆర్‌ఐ సతీశ్, ఆర్ ఎస్సై శ్రవణ్‌కుమార్, క్యాంపు క్లర్క్ వేణుగోపాల్, క్రీడాకారులు పాల్గొన్నారు.
హన్మకొండ చౌరస్తా: వ్యాక్సినేషన్ కోసం వచ్చే గర్భిణులు, బాలింతలతో దురుసుగా ప్రవర్తించవద్దని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన గత బుధవారం నిర్వహించిన వ్యాక్సినేషన్ సెషన్ల వివరాలు పరిశీలించారు. సెంటర్‌కు వచ్చే వారితో మర్యాదగా మెసులుకోవాలని, సమయపాలన పాటించాల న్నారు. టీకా, పోలియో చుక్కల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, సిబ్బందిని నియమించాలని టీకా సెంటర్ సిబ్బంది డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు.
ఘనంగా నాగవెల్లి సదస్యం
ఘనంగా నాగవెల్లి సదస్యం


