ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట్ల మెజార్టీ | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట్ల మెజార్టీ

Feb 14 2026 10:20 AM | Updated on Feb 14 2026 10:20 AM

ఓరుగల

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

కేయూలో విచారణ కమిటీ నియామకం వరంగల్‌ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు సంపూర్ణ సోలార్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలి పక్కా ప్రణాళికతో పార్కులు నిర్మించాలి ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు విద్యుత్‌ అంతరాయానికి కారణం కోతి లెప్రసీపై అపోహలు వీడాలి

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

పరకాలలో రంగులు చల్లుకుంటున్న

కాంగ్రెస్‌ అభ్యర్థి కోయడ శ్రీనివాస్‌, కార్యకర్తలు

12 మున్సిపాలిటీలకు ఏడు పీఠాలు పక్కా కాగా.. మరో నాలుగింటిపైన కాంగ్రెస్‌ గురి పెట్టింది. స్వతంత్రులు, ఎక్స్‌ అఫీ షియో ఓట్ల ద్వారా తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. పరకాల, భూపాలపల్లి, డోర్నకల్‌, మరి పెడ, ములుగు, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మహబూబాబాద్‌లో 36 వార్డులకు 13 చోట్ల కాంగ్రెస్‌ సొంతగా గెలవగా, మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంలు తలా మూడు గెలిచాయి. నాలుగు చోట్ల గెలిచిన స్వతంత్రుల మద్దతు కూడగడుతోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ 12, బీజేపీ ఒక్కటి గెలవడం వల్ల కాంగ్రెస్‌కే పీఠం దక్కనుంది. వర్ధన్నపేటలో 12 వార్డులకు ఆరు బీఆర్‌ఎస్‌ గెలవగా, ఐదు గెలిచిన కాంగ్రెస్‌ ఒక ఇండిపెండెంట్‌ను కలుపుకుంది. దీంతో హంగ్‌ ఏర్పడగా.. ఎక్స్‌ అఫీషియో ఓటుతో గట్టెక్కాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కేసముద్రంలో 16 వార్డులకు తలా 8 రావడంతో ఇక్కడా హంగ్‌ నుంచి గట్టెక్కేందుకు ఎక్స్‌ అిఫీషియో అస్త్రాన్ని ఉపయోగించే యోచనలో కాంగ్రెస్‌ ఉంది. తొర్రూరులో 16 వార్డులకు 9 వార్డులను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ ఆ పీఠం దక్కించుకోనుంది. జనగామలో 30 వార్డులకు బీఆర్‌ఎస్‌ సొంతంగా 13 గెలుచుకోగా, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టింది. కాంగ్రెస్‌ 12, సీపీఎం 1 గెలవగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో రెండు పార్టీలకు తలా 15 అవుతుండడంతో ఇక్కడ అన్ని పార్టీల ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులకు ఇటీవల ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా ఆ విభాగం బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించే అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ ఒక ప్రాక్టికల్స్‌ పరీక్షలకు ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌గా వ్యవహరించడంపై ఆరోపణలు వచ్చాయి. ఆవిభాగంలో ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణ వ్యవహారంలో ఆరోపణలకు సంబంధించిన అంశాలు వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వీసీ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం ఈ నెల 10న ఓ విచారణ కమిటీని నియమించారు. ఇది శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈవిచారణ కమిటీ చైర్మన్‌గా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌, సభ్యులుగా పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.రాజు, అకడమిక్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ త్వరగా సమర్పించాలి. ఈవిచారణ కమిటీ పరీక్షల విభాగంనుంచి ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్‌ నియమాక పత్రం ఆర్డర్‌ కాపీ (కాన్ఫిడెన్షియల్‌ కాపీ) బయటకు ఎలా లీక్‌ అయిందనే విషయంపై కూడా విచారణ జరపాలని అలాగే ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణపై కూడా వచ్చిన ఆరోపణలపై ఈ విచారణ కమిటీ విచారణ జరపాల్సి ఉంది. సాద్యమైనంత త్వరంగా విచారణ పూర్తిచేసి తనకు రిపోర్ట్‌ సమర్పించాల్సిందిగా రిజిస్ట్రార్‌ విచారణ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్‌: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చి నట్లు మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్‌.మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ (శనివారం) వారంతపు యార్డు బంద్‌, 15న(ఆదివారం) వారంతపు సెలవు ‘మహా శివరాత్రి పండుగ’, 16న(సోమవారం) శివరాత్రి తెల్ల వార్లు జాగరణ, 17న (మంగళవారం) అమావాస్య మార్కెట్‌ బంద్‌ ఉంటుందని, ఈ నా లుగు రోజులు మార్కెట్‌ యార్డుల్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులు, వ్యాపారులు, కార్మికులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు. 18వ తేదీ బుధవారం మార్కెట్‌ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్‌ సోలార్‌ గ్రామాల్లో సోలార్‌ పలకల బిగింపును మార్చి 31 నాటికి పూర్తి చేసి సంపూర్ణ సోలార్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి 9 సర్కిళ్ల సూపరింటెండెంటింగ్‌ ఇంజనీర్లు, డివిజనల్‌ ఇంజనీర్లు, రెడ్‌ కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌ పరిధి 37 గ్రామాలను మోడల్‌ సోలార్‌ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. డైరెక్టర్‌ టి.మధుసూదన్‌, సీఈలు వెంకటరమణ, శ్రవణ్‌కుమార్‌, అశోక్‌, జీఎంలు శ్రీనివాస్‌, మల్లికార్జున్‌, డీఈలు అమర్‌నాథ్‌, అనిల్‌కుమార్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

వరంగల్‌ అర్బన్‌: పక్కా ప్రణాళికతోనే పార్కులు అభివృద్ధి చేయాలని బల్దియా కమిషనర్‌ చాహత్‌ జాజ్‌పాయ్‌ అన్నారు. నర్చరింగ్‌ నైబర్‌ హుడ్‌ ఛాలెంజ్‌ 2.0లో భాగంగా వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డబ్ల్యూఆర్‌ఐ) వారు డిజైన్లను అందజేసిన నేపథ్యంలో బాలసముద్రంలోని చిల్డ్రన్స్‌ పార్క్‌ను శుక్రవారం కమిషనర్‌ సందర్శించి సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. పార్కులో డీఏ ల్యాండ్‌ స్కేప్‌ వారు నర్చరింగ్‌ నైబర్‌ హుడ్‌ ఛాలెంజ్‌ 2.0లో భాగంగా అందించిన డిజైన్ల ప్రకారం నమూనాలు ఉండాలని సూచించారు. పార్కులో ఆంపీ థియేటర్‌, సాండ్‌ ఫిట్‌, వుడెన్‌ ప్లాంక్‌, సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈపనులకు టెండర్‌ పూర్తయినందున ప్రారంభించి 45 రోజుల్లో పూర్తి చేయాలని ఏజెన్సీ నిర్వహకులు సూచించారు. సీహెచ్‌ఓ రమేశ్‌, డీఈలు రాజ్‌కుమార్‌, శ్రీకాంత్‌ తదితరులున్నారు.

4. స్టేషన్‌ ఘన్‌పూర్‌

1. ములుగు

2. భూపాలపల్లి

3. పరకాల

7. డోర్నకల్‌

క్యాంపులకు తరలిన కౌన్సిలర్లు...

హైదరాబాద్‌, వరంగల్‌లోనే మకాం..

పన్నెండు మున్సిపాలిటీల్లో శుక్రవారం ఉదయం నుంచే కౌంటింగ్‌ మొదలై ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తం అయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో ఆధిక్యత పెరిగి విజయావకాశాలున్న కౌన్సిలర్లను ఒక్కచోట చేర్చేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఫలితాల వెల్లడైన వెంటనే ఒక్కో మున్సిపాలిటీకి చెందిన క్యాంపు ఇన్‌చార్జ్‌లు వారికి నిర్దేశించిన ప్రాంతాలకు గెలిచిన వారిని తరలించారు. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డుల్లో కాంగ్రెస్‌ 140, బీఆర్‌ఎస్‌ 88, బీజేపీ 8 వార్డులు కై వసం చేసుకోగా, సీపీఐ 4, సీపీఎం 5, ఇతరులు, ఇండిపెండెంట్లు 15 చోట్ల గెలుపొందారు. స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడింటితో పాటు కనీసం మరో మూడు మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం లక్ష్యంగా క్యాంపులు నిర్వహిస్తోంది. అలాగే ఆయా పార్టీల కౌన్సిలర్లు చెదిరిపోకుండా మిగతా పార్టీలు కూడా క్యాంపులకు తరలించారు. 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు జరగనుండగా.. అందుబాటులో ఉండేలా క్యాంపులు ఏర్పాటు చేశారు. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిలాలోని 12 మున్సిపాలిటీలకు చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో హైదరాబాద్‌, వరంగల్‌లోని రిసార్టులు, ఫంక్షన్‌ హాళ్లు, హోట ళ్లలో బస చేసినట్లు తెలిసింది.

చేజారకుండా..

పరకాల: పరకాల మున్సిపాలిటీలో 13 స్థానాలతోకాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఆ పార్టీ కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి క్యాంపునకు తరలించారు. ఈనెల 16న చైర్మన్‌ ఎన్నిక సమయానికి అభ్యర్థులందరూ పరకాల మున్సిపల్‌ కార్యాలయానికి నేరుగా చేరుకుంటారు.

మున్సిపాలిటీలు మొత్తం బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీజేపీ సీపీఐ సీపీఎం స్వతంత్రులు/

వార్డులు ఇతరులు

పరకాల 22 06 13 03 – – –

నర్సంపేట 30 06 21 01 – 01 01

వర్ధన్నపేట 12 06 05 – – – 01

జనగామ 30 13 12 – – 01 04

స్టేషన్‌ ఘన్‌పూర్‌ 18 05 13 – – – –

మహబూబాబాద్‌ 36 11 13 01 03 03 05

తొర్రూరు 16 09 07 – – – –

మరిపెడ 15 05 09 – – – 01

డోర్నకల్‌ 15 04 11 – – – –

కేసముద్రం 16 08 08 – – – –

భూపాలపల్లి 30 10 16 02 01 01

ములుగు 20 05 12 01 – – 02

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

మ్మడి వరంగల్‌ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. మొత్తం 12 మున్సిపాలిటీలకు 7చోట్ల స్పష్టమైన ఆధిక్యతను సాధించిన ఆ పార్టీ ఆయా మున్సిపల్‌ పీఠాలను దక్కించుకోనుంది. ఓట్ల లెక్కింపులో వచ్చిన వార్డు సభ్యుల ఆధిక్యతను బట్టి తొర్రూరు మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగురనుంది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్‌ నెలకొనగా, మహబూబాబాద్‌, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం మున్సిపల్‌ పీఠాల కోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వర్ధన్నపేట, కేసముద్రంలలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య నువ్వా నేనా? అన్న రీతిలో ఉండగా... వర్ధన్నపేటను ఎక్స్‌ అిఫీషియో ఓటుతో గెలిచే యత్నాల్లో ఉన్నారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ ఒక్క వార్డు ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు మిత్రపక్షాలు, ఇండిపెండెంట్ల మద్దతు తర్వాత సమానంగా మారినట్లు ఆ పార్టీ వర్గాలు చెబు తున్నాయి. మహబూబాబాద్‌లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉన్నా.. ఇక్కడ అధికార పార్టీ అడ్వాంటేజీ తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా, పంచా యతీ ఎన్నికల్లో బలం పెంచుకున్న బీజేపీ జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, కేసముద్రం, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవలే దు. 240 వార్డులకు పోటీచేసి ఎనిమిది గెలిచింది. సీపీఐ 4, సీపీఎం 5, స్వతంత్రులు/ ఇతరులు 15 వార్డుల్లో గెలుపొందారు.

పరకాలలో ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, నర్సంపేటలో కలెక్టర్‌ సత్యశారద

కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్‌

న్యూశాయంపేట/హన్మకొండ అర్బన్‌: వరంగల్‌ జిల్లా పరిధి నర్సంపేట, వర్ధన్నపేట, హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీల్లో శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని కలెక్టర్లు డాక్టర్‌ సత్యశారద, స్నేహ శబరీష్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిచేయడానికి జిల్లా యంత్రాంగం పనిచేసిందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు అభ్యర్థులు, వారి ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్‌ బందో బస్తు కల్పించామని చెప్పారు. ఎన్నికల్లో భాగస్వాములైన అందరికీ కలెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌: 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. అప్పుడు కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీలు దరిదాపులకు కూడా రాని పరిస్థితి. అదే 2026 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారింది. గులాబీ పార్టీకి కంచుకోటలాంటి మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ పరం అయ్యాయి. తొర్రూరు తర్వాత వర్ధన్నపేట, జనగామ, కేసముద్రం మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం కనిపించినా మిగతా చోట్ల ఇబ్బందికరంగానే మారింది. చాలాచోట్ల బీఆర్‌ఎస్‌ నేతలు గెలుపు కోసం శ్రమించినా ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..

2020 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌లో 9 మున్సిపాలిటీలు 200 వార్డులు ఉన్నాయి. 200 వార్డులకు 134 బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌ 33, బీజేపీ 10, సీపీఐ 4, సీపీఎం 2, ఇతరులు/స్వతంత్రులు 17 వార్డుల్లో గెలిచా రు. ఈ లెక్కన మొత్తం 9 మున్సిపాలిటీలపై గులాబీ జెండానే ఎగిరింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల నాటికి కొత్తగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్‌, ములుగు, కేసముద్రం కలిపి మొత్తం 12 మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 260 వార్డులకు 140 కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకోగా, బీఆర్‌ఎస్‌ 88, బీజేపీ 8, సీపీఐ 4, సీపీఎం 5, ఇతరులు/స్వతంత్రులు 15 గెలుచుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో మాత్రమే స్పష్టమైన మెజార్టీ రాగా, పాత 9 మున్సిపాలిటీల్లో ఏడు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ వార్డు సభ్యులే అత్యధికంగా గెలుపొందారు. కేసముద్రం, జనగామ, వర్ధన్నపేటలో నువ్వా, నేనా? అన్నరీతిలో వార్డులను బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో కూడా బీఆర్‌ఎస్‌ను ఓటర్లు ఆదరించారు.

ఫలితాలపై పోస్టుమార్టం..

గత ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది మున్సిపాలిటీలను గెలిచిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఒకటి, రెండు స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 12 మున్సిపాలిటీలకు పరకాల, నర్సంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, ములుగు, డోర్నకల్‌, మరిపెడ, భూపాలపల్లిలో కాంగ్రెస్‌, తొర్రూరులో బీఆర్‌ఎస్‌ క్లియర్‌ మెజార్టీని సాధించాయి. గట్టిగా పోరాడిన జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్‌ హంగ్‌లో చేరడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పోస్టుమార్టం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, గత ఎన్నికలకు ఇప్పటికీ ఓట్లు, సీట్లు తగ్గడంపై కూడా సమీక్షించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. కాగా, ఎక్స్‌అఫీషియో ఓట్లతోనైనా హంగ్‌ స్థానాలను కై వసం చేసుకునే దిశగా పార్టీ హైకమాండ్‌తో స్థానిక నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఎంజీఎం సూపరింటెండెంట్‌ హరీశ్‌ చంద్రారెడ్డి

ఎంజీఎం: ఎంజీఎంలోని కోబాల్ట్‌ /క్యాన్సర్‌ భవనం పక్కన ఉన్న ఎలక్ట్రికల్‌ డీపీ నిర్మాణంపై కోతి పడడంతోనే ఈనెల 12న ఉదయం ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరాలో ఊహించని అంతరాయం ఏర్పడిందని హాస్పిటల్‌ గ్రేడ్‌–1 ఎలక్ట్రీషియన్‌ టి.వినోద్‌కుమార్‌ నివేదిక సమర్పించినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ హరీశ్‌చంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 12న ఎంజీఎంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయంపై 13వ తేదీన పత్రికల్లో వచ్చిన వార్తపై అయన స్పందించారు. కోతి పడిందని ఎన్పీడీసీఎల్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని దాదాపు గంటలో విద్యుత్‌ను పునరుద్ధరించినట్లు వివరించారు. ఈసమయంలో ఆస్పత్రి సేవలు, అల్ట్రాసౌండ్‌ స్కాన్లు, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే తదితర పరికరాలు జనరేటర్‌ విద్యుత్‌ సరఫరాతో అంతరాయం లేకుండా పనిచేసినట్లు వివరించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సీటీ స్కాన్‌ సరఫరాకు కనెక్ట్‌ కాలేదని తెలిపారు. ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ పునరుద్ధరణ అనంతరం సేవలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.

లెప్రసీ వ్యాధిపై అపోహలు వీడాలి.. తొలి దశలోనే గుర్తించి 6 నెలలు ఎండీటీ చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని ఎంజీఎం సూపరింటెండెంట్‌ హరీశ్‌ చంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ‘స్పర్శ్‌‘ లెప్రసీ అవగాహన పక్షోత్సవం ముగింపు నిర్వహించారు. ఎంజీఎం హాస్పిటల్‌లోని తాత్కాలిక హాస్పిటలైజేషన్‌ వార్డులో నిర్వహించిన ఈకార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్యతో కలిసి హరీశ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్‌ అశ్విని, జిల్లా మాస్‌ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఎస్‌.శ్రీనివాస్‌ హనుమకొండ, వరంగల్‌ జిల్లాల డీపీఎంఓలు సతీశ్‌రెడ్డి రవీందర్‌, అనుపమ, వెంకన్న, జయరాజ్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ జ్యోతి, ఎం.ఎన్‌.ఓ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏడు ‘పుర’ పీఠాలు పక్కా.. మరో నాలుగింటిపై కాంగ్రెస్‌ గురి..

5. నర్సంపేట

మొత్తం వార్డులు260

తొర్రూరుపై గులాబీ జెండా..

నాలుగు చోట్ల హంగ్‌

‘హంగ్‌’లోని మరో మూడింటిపై

కాంగ్రెస్‌ గురి

వర్ధన్నపేట, కేసముద్రంలో

నువ్వా, నేనా? జనగామపై బీఆర్‌ఎస్‌ పట్టు

ఎక్స్‌అఫీషియో ఓట్లతో గట్టెక్కేలా

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల వ్యూహం

హంగ్‌ ‘పుర’ పీఠాల కోసం

ఆ రెండు పార్టీల పోటాపోటీ

ఓట్ల లెక్కింపు కేంద్రాలనుంచి

క్యాంపులకు కౌన్సిలర్లు..

అడ్డాగా ఫంక్షన్‌హాళ్లు, రిసార్టులు..

వార్డుల వారీగా పార్టీల బలాబలాలు

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట1
1/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట2
2/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట3
3/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట4
4/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట5
5/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట6
6/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట7
7/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట8
8/8

ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. ఏడుచోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement