ఎట్టకేలకు పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు పదోన్నతులు

Feb 14 2026 10:20 AM | Updated on Feb 14 2026 10:20 AM

ఎట్టకేలకు పదోన్నతులు

ఎట్టకేలకు పదోన్నతులు

ఎట్టకేలకు పదోన్నతులు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న అధ్యాపకులకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. క్యాస్‌ పదోన్నతులకు సంబంధించి గతేడాది డిసెంబర్‌ 30న కేయూ పాలకమండలి ఆమోదించింది. వర్సిటీలో అన్ని విభాగాలు కలిపి 45మంది అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. ఇందులో 29మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్‌గా వై.నర్సింహారెడ్డికి, మేథమెటిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌ మల్లారెడ్డికి సీనియర్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. వివిధ విభాగాల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న ఎన్‌.రమణ, కె.కిశోర్‌కుమార్‌, కె.భిక్షాలు, టి.జగన్మోహన్‌రావు, ఎల్‌పీ రాజ్‌కుమార్‌, కె.అయిలయ్య, ఎం.స్వర్ణలత, వి.స్వరూపరాణి, బి.నాగరాజుకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. 2010లో వివిధ విభాగాల్లో నియమితులైన 26 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పలు కారణాలతో కొన్నేళ్లుగా పదోన్నతి కల్పించలేదు. ఎట్టకేలకు వీరందరికీ అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. ఆయా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సెలక్షన్‌ గ్రేడ్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సీనియర్‌ స్కేల్‌తో పదోన్నతులు కల్పించారు. ఈ ఉత్తర్వులు అందజేతలో అకుట్‌ అధ్యక్షుడు బి.వెంకట్రామ్‌రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ పంజాల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశోధనల పరంగా ముందుకెళ్లాలి..

కేయూలో అకడమిక్‌ పరంగా, నాణ్యమైన విద్యాబోధన, పరిశోధనల కోసం కృషి చేయాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి పదోన్నతులు పొందిన అధ్యాపకులను కోరారు. శుక్రవారం వివిధ విబాగాల, కళాశాలల అధ్యాపకులకు రిజిస్ట్రార్‌ రామచంద్రంతో అకుట్‌ అధ్యక్షుడు బి.వెంకట్రామ్‌రెడ్డితో కలిసి పదోన్నతుల ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్సిటీ ప్రతిష్టను పెంచేలా అధ్యాపకులంతా కృషి చేయాలని సూచించారు.

ఏళ్ల నిరీక్షణకు తెర

హర్షాతిరేకాల్లో కేయూ అధ్యాపకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement