నేటినుంచి మల్లన్న ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు
● పాంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా ఐదు రోజులపాటు ఉత్సవాలు
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో నేటి(శుక్రవారం)నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో పాంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా శ్రీ భ్రమరాంభికా మల్లికార్జునస్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు శైవ ఆగమోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.వాహన సేవల్లో పాల్గొనే వారు దేవస్థాన కార్యాలయంలో రూ.516 చెల్లించి రశీదు పొందాలని, శివరాత్రి ఉత్సవాల 5రోజులపాటు దాతల సహకారంతో మహా అన్నదానం జరుగుతుందని ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ఈఓ కందుల సుధాకర్ గురువారం తెలిపారు.


