చిన్నారుల సమాచారం ఇవ్వండి
వరంగల్ క్రైం: కాజీపేట పోలీస్, రైల్వేస్టేషన్ పరి సర ప్రాంతాల్లో చిన్నారుల ను అపహరించిన ము ఠాను టాస్క్‌ఫోర్స్, కాజీ పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వారి తల్లిదండ్రులు సరైన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చి న సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్‌లో కాజీపేట రైల్వే ప్లాట్ ఫాం నుంచి అపహరించగా, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో, ఇంకో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్ పరిస ర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించి సరైన ఆధారాలను పట్టుకొని కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి సెల్ నంబర్ 87126 85122లో సంప్రదించి పిల్లలను తీసుకువెళ్లాలన్నారు.
కుక్క అడ్డు రావడంతో బైక్ సడెన్ బ్రేక్..
● కిందపడిన మహిళ.. అక్కడికక్కడే మృతి
పాలకుర్తి టౌన్: కుక్క అడ్డం రావడంతో సడెన్ బ్రేక్ వేయగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వెంపాల పూలమ్మ (50), బా ల్‌రెడ్డి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డూరు మండల కేంద్రంలో పూలమ్మ చెల్ల్లి ఇంటిలో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి పాలకుర్తి మీదుగా బయలుదేరారు. మండలంలోని తొర్రూరు గ్రామానికి చేరుకోగా కుక్క.. బైక్‌కు అడ్డుగా వచ్చింది. దీంతో సడెన్‌గా బ్రేక్ వేయడంతో పూలమ్మ కిందపడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది.
చిన్నారుల సమాచారం ఇవ్వండి
చిన్నారుల సమాచారం ఇవ్వండి


