ఏజెన్సీపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీపై చర్యలు తీసుకోండి

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

ఏజెన్సీపై చర్యలు తీసుకోండి

ఏజెన్సీపై చర్యలు తీసుకోండి

ఏజెన్సీపై చర్యలు తీసుకోండి

బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

నయీంనగర్‌: గడువులోగా భద్రకాళీ బండ్‌ పనులు పూర్తి చేయాలని, బండ్‌ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సుచీర్‌ ఇండియా ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌, ‘కుడా’ వీసీ చాహత్‌ బాజ్‌పాయ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్‌ భద్రకాళి బండ్‌పై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలిచ్చారు. భద్రకాళి బండ్‌ డీ, ఈ జోన్లలో జరుగుతున్న ఫ్లోరింగ్‌, హార్టికల్చర్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ‘కుడా’ అధికారులు సీపీఓ అజిత్‌ రెడ్డి, ఈఈ భీమ్‌ రావు, బల్దియా ఈఈలు రవికుమార్‌, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

పనుల్లో వేగం పెంచండి

వరంగల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. బుధవారం ‘కుడా’ కార్యాలయం మినీ మీటింగ్‌ హాల్లో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. బస్‌ టెర్మినర్‌ త్వరగా పూర్తిచేయడానికి సూచనలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement