ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌

Feb 1 2026 7:30 AM | Updated on Feb 1 2026 7:30 AM

ఎస్‌ఐ

ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌

ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ తెన్నేటి సుధాదేవి కథా సంపుటి ఆవిష్కరణ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు కాలువలో పడి బాలుడి మృతి కామన్‌ మెస్‌లో ప్లేట్ల కొరత

కాజీపేట: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ నిర్వహణపై శనివారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ జిల్లా అధికారులతో కలిసి వీసీకి హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ రవి, ఆర్డీఓలు రమేష్‌ రాథోడ్‌, డాక్టర్‌ నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: హనుమకొండ ఎకై ్సజ్‌ కాలనీలోని నవీన్‌ రెసిడెన్సీలో వంశీ ఇంటర్నేషనల్‌, ఇండియా అధ్యక్షుడు వంశీ రామరాజు తన భార్యపేరుతో రచించిన డాక్టర్‌ ‘తెన్నేటి సుధాదేవి కథా సంపుటి’ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. అంపశయ్య నవీన్‌ అధ్యక్షతన జరిగిన సభలో సుధాదేవి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రొఫెసర్‌ రామాచంద్రమౌళి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సుధాదేవి కుటుంబమంతా సాహిత్యకారులేనని కొనియాడారు. ఆమె తండ్రి విద్వాన్‌ టీ.వి.సుబ్బారావు గురించి, తల్లి అహల్యాదేవి అనుబంధం గురించి వంశీ రామరాజు వర్ణించారు. కథా సంపుటిలోని కథ శ్రేష్టత గురించి నెల్లుట్ల రమాదేవి విశ్లేషించారు.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 2 నుంచి 11 వరకు నిర్వహించనున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ ఎ.గోపాల్‌ తెలిపారు. 64 కేంద్రాల్లో జనరల్‌ కోర్సులు, 10 కేంద్రాల్లో ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 17,670 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 406 మంది అధ్యాపకులను ఎగ్జామినర్లుగా, 71 మందిని చీఫ్‌ సూపరింటెండెంట్లుగా, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు నియమించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు ఓరియెంటేషన్‌ నిర్వహించినట్లు డీఐఈఓ గోపాల్‌ వివరించారు.

ఎల్కతుర్తి: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్‌ (పిల్ల) కాలువలో పడి ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్‌కు చెందిన చదిరం ప్రశాంత్‌–అనూష దంపతుల కుమారుడు శశివర్ధన్‌(4) మృతి చెందాడు. గ్రామంలో ఇళ్ల సమీపంలో ఉన్న డీబీఎం–20 కెనాల్‌ పిల్ల కాలువ వద్ద మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. కాగా, ఇటీవలే సమ్మక్క–సారలమ్మ జాతర నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యార్థుల ఆందోళన

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని కామన్‌మెస్‌లో స్టీల్‌ ప్లేట్ల కొరతతో విద్యార్థులు ఆందోళన చేశారు. మెస్‌ కార్డులు కలిగిన విద్యార్థులకు అనుగుణంగా స్టీల్‌ ప్లేట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. కొందరు విద్యార్థులు ప్లేట్లలో భోజనం తీసుకొని గదుల్లోకి వెళ్లి అక్కడే భోజనం చేయడంతో సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం రాత్రి కామన్‌మెస్‌లో సూపర్‌వైజర్‌, కేర్‌టేకర్‌ కూడా విధుల్లో లేరని సమాచారం. పర్యవేక్షించాల్సిన హాస్టళ్ల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌ అందుబాటులో లేరు. వివరణ కోసం ఫోన్‌చేస్తే కూడా ఔట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియా అని వచ్చింది. కామన్‌మెస్‌లో ప్లేట్ల కొరతపై విద్యార్థుల ఇబ్బందులు పడుతున్నారని, పలువురు విద్యార్థులు టేబుల్స్‌ కిందపడేసిన విషయాన్ని కామన్‌ మెస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సుమంత్‌ కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి పేపర్‌ప్లేట్స్‌ కొనుగోలు చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.

ఎస్‌ఐఆర్‌పై వీడియో  కాన్ఫరెన్స్‌1
1/2

ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌

ఎస్‌ఐఆర్‌పై వీడియో  కాన్ఫరెన్స్‌2
2/2

ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement