విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలు లేనట్టే! | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలు లేనట్టే!

Feb 1 2026 7:30 AM | Updated on Feb 1 2026 7:30 AM

విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలు లేనట్టే!

విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలు లేనట్టే!

విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలు లేనట్టే!

హన్మకొండ: విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో లేవనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్‌ షెడ్యూల్‌ ప్రకారం.. శనివారం బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఎన్పీడీసీఎల్‌లోని అన్ని స్థాయిల్లో బదిలీలు నిలిపేశారు. అధికారికంగా ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. అయితే, రాష్ట్రంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని యాజమాన్యం నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో బదిలీల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. మరోవైపు విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేయవద్దని, మే, జూన్‌ మాసంలో బదిలీలు చేయాలని, మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే బదిలీ చేయాలనే డిమాండ్‌తో గత నెల 28న హైదరాబాద్‌లోని టీజీ ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ జేఏసీ సంయుక్తంగా రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించాయి. బీఎంఎస్‌ అనుబంధ సంఘాలతో కూడిన జేఏసీ మినహా మి గతా రెండు జేఏసీలు బదిలీలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్‌ ఎన్నికలు రావడం, ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. తిరిగి ఎప్పుడు బదిలీలు చేపడతారనే విషయంపై విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు స్పష్టత ఇవ్వలేదు. మే, జూన్‌ మాసం వరకు నిలిపివేస్తారా? మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ ముగియగానే బదిలీలు చేపడతారా అనే మీమాంస నెలకొంది.

షెడ్యూల్‌ ప్రకారం వెలువడని ఉత్తర్వులు

పురపాలక ఎన్నికల దృష్ట్యా వాయిదా

తిరిగి ఎప్పుడు చేపడతారనే అంశంపై స్పష్టత కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement