గ్రీన్‌ఎనర్జీ కోసం ప్రభుత్వం పాలసీ
హన్మకొండ: గ్రీన్‌ఎనర్జీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని టీజీ ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతిరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్రస్థా యి సమావేశం, అసోసియేషన్ 2026 డైరీ, క్యాలెండర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. సమావేశంలో తిరుపతిరెడ్డి ము ఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కర్బన ఉద్గారాలు నిరోఽధి చేందుకు సోలార్, బ్యాటరీ ఎనర్జీ, స్టోరేజీ ఎనర్జీని ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఈ దిశగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటును పెద్ద ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. గృహజ్యోతి ప థకం సఫలీకృతం కావడంలో అకౌంట్స్ ఆఫీసర్స్ ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ నాజర్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య మాట్లాడుతూ అకౌంట్స్ వి భాగం ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టీజీ జెన్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ వీర మహేందర్, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు అశోక్, వేణుబాబు, అనిల్, అనురాధ, ఉపేందర్, వెంకటేశ్, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, దేవేందర్, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్‌కో విద్యుత్ అకౌంట్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.


