15న ఆధ్యాత్మిక సమ్మేళనం
ఇండస్ ఫౌండేషన్ చైర్మన్
ఏనుగుల రాకేశ్ రెడ్డి
హన్మకొండ: ఓరుగల్లు వైభవాన్ని చాటేలా మహా శివరాత్రి రోజున ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనాన్ని ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 15న హనుమకొండ బాలసముద్రంలోని ‘కుడా’ మైదానంలో సాయంత్రం 5:30 నుంచి 16న ఉదయం 5 గంటల వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈసమ్మేళనానికి పలువురు ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు హాజరుకానున్నట్లు, విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సమ్మేళన కరపత్రాలను భద్రకాళి శేషు ఆవిష్కరించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఎలగందుల రాజు, కార్పొరేటర్ రవి నాయక్, ప్రముఖ యోగా గురువు పోశాల శ్రీనివాస్, ఇండస్ ఫౌండేషన్ కార్యదర్శి పురుషోత్తం యాదవ్, మహాశివరాత్రి కార్యక్రమ నిర్వాహకులు అభిషేక్, సుకాంత్, దీపక్, అఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.


