త్రివర్ణాలతో రుద్రేశ్వరస్వామికి అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వెండి కవచానికి జాతీయ జెండా వర్ణాలైన త్రివర్ణాలను అద్ది తెల్లజిల్లెడు పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు జరిపారు. శివ ప్రీతికరమైన సోమవారం వందలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
ఎంజీఎం: పుట్టబోయే బిడ్డ ఆడైనా, మగైనా తల్లిదండ్రులు సమానంగా ఆదరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ‘బాలికా పరిరక్షణ–తల్లిదండ్రులకు అవగహన’పై చేపడుతున్న కార్యక్రమాలకు సంబంఽధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, ప్రోగ్రాం అధికారి శ్రీని వాస్, డెమో వి.అశోక్ రెడ్డి తదితరులున్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్డేడియంలో ఏర్పాటు చేసిన మేడారం జాతర ఆర్టీసీ బస్ పాయింట్‌ను సోమవారం టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మన్ తనిఖీ చేశారు. రెండో రోజు వరంగల్ ఆర్టీసీ–2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్, అసిస్టెంట్ మేనేజర్ భవాని, ఇన్‌చార్జ్ బైరి రవీందర్, ఆర్టీసీ సిబ్బంది 19 బస్సుల్లో 644 మంది ప్రయాణికులను మేడారానికి పంపించారు. వాసవి క్లబ్ వారు ప్రయాణికుల కోసం ఉచిత మినరల్ వాటర్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి రెండు వాహనాలు సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. దీంతో అరగంటకు పైగా ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. హనుమకొండ వైపు వెళ్తున్న ఓ కారు, ఎలక్ట్రికల్ బస్సు బ్రిడ్జిపైకి రాగానే సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగిపోయాయి. దీంతో బ్రిడ్జికి రెండు వైపులా వాహనాలు బారులుదీరాయి. మేడారం జాతరకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐలు సుధాకర్‌రెడ్డి, వెంకన్న సిబ్బందితో అక్కడికి చేరుకుని వన్ వే పద్ధతిలో వాహనాలు కొద్దిసేపు పంపించి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
త్రివర్ణాలతో రుద్రేశ్వరస్వామికి అలంకరణ
త్రివర్ణాలతో రుద్రేశ్వరస్వామికి అలంకరణ
త్రివర్ణాలతో రుద్రేశ్వరస్వామికి అలంకరణ


