కోటలో విదేశీయుల సందడి
ఖిలా వరంగల్ : కాకతీయుల కాలంలో నిర్మించిన కట్టడాలు, నల్లరాతి శిల్పకళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని రష్యా, జర్మనీ, థాయిలాండ్, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన పర్యాటకులు కొనియాడారు. మంగళవారం ఖిలా వరంగల్ మధ్యకోటను విదేశీయులు సందర్శించి నల్లరాతి శిల్పాలను వీక్షించారు. అనంతరం ఏకశిల గుట్ట, ఖుష్‌మహాల్, రాతి, మట్టి కోట అందాలను తిలకించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. కాకతీయుల చరిత్రను కాపాడి భావితరాలకు అందజేయాలని విదేశీ పర్యాటకులు పేర్కొన్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఇన్‌చార్జ్ శ్రీకాంత్, టీజీటీడీసీ ఇన్‌చార్జ్ అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులకు ప్రత్యేక వైద్యశిబిరాలు
ఎంజీఎం : మేడారం మహాజాతరలో, అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మజాతరతో సహా హనుమకొండ జిల్లా పరిధిలో మొత్తం 22 ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య మంగళవారం పేర్కొన్నారు. మేడారం మహాజాతరలో 48 మందిని డిప్యూటేషన్‌పై పంపించినట్లు తెలిపారు. హనుమకొండ బస్‌స్టేషన్, హయగ్రీవాచారి గ్రౌండ్, మేడారం, అగ్రంపహాడ్ దారిలో గల ఊరుగొండ, గూడెప్పాడ్ ఎక్స్ రోడ్డు, ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కటాక్షపూర్ చెరువు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహిస్తున్న అగ్రంపహాడ్, అమ్మవారిపేట, పీచర, ఎర్రబెల్లి, దామెర, మాధన్నపేట, మరిపల్లి గూడెం, కమలాపూర్, పులిగిల్ల, జోగంపల్లి, రాయపర్తి, ఐనవోలు ఇతర ప్రాంతాలకు స్థానిక వైద్యసిబ్బందితో పాటు అదనంగా ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను డిప్యూటేషన్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 28నుంచి 31వ తేదీ వరకు 348 మంది వైద్యసిబ్బంది సేవలందించనున్నట్లు, 108 వాహనాలను అత్యవసర ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశామన్నారు.
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు బంద్ ఉండనున్నట్లు మార్కెట్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడారం జాతర సందర్భంగా వ్యాపారులు, దడువాయి, హమాలీ కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు బుధ, గురు, శుక్రవారాలు సెలవులు ఇవ్వాలని వినతి మేరకు మూడు రోజులు మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. వీటితోపాటు శనివారం యార్డు బంద్, ఆదివారం వారంతపు సెలవు ఉన్నందున వరుసగా బుధవారం నుంచి ఆదివారం వరకు (5 రోజులు) మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.
పీపీగా రాజేంద్రనాథ్
వరంగల్ లీగల్ : హనుమకొండ రెండో అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా వరంగల్ ర్పుకోటకు దిన సీనియర్ న్యాయవాది సంగరబోయిన రాజేంద్రనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. జిల్లా పరిధిలోని సెషన్స్ కేసుల్లో బాధితుల పక్షాన వీరు వాదిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి రాజేంద్రనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కోటలో విదేశీయుల సందడి


