పోలీసుల అత్యుత్సాహం
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల చుట్టు పక్కల, గద్దెల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆదివారం గద్దెల వద్ద భక్తుల దర్శనాలు, ఇతర కార్యక్రమాల కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించినా ఎస్పీ తమకు చెప్పలేదని నిర్లక్ష్య సమాధానం చెబుతూ గేటువద్దే అడ్డుకున్నారు. ఇదేకాకుండా ఎండోమెంట్ సిబ్బంది, పూజారులను సైతం అడ్డుకోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గద్దెల వద్ద పారిశుద్ధ్య పనులు చేయించే పంచాయతీ కార్యదర్శులు తమ డ్యూటీ ఐడీ కార్డులను చూపినా తమకేమి తెలియదని, డీఎస్పీ, ఎస్పీ చెప్పాలని తెలుపడంతో కార్యదర్శులు అవమానంగా భావించి విధుల్లో పాల్గొనబోమని డీపీఓ వెంకయ్యకు ఫిర్యాదు చేశారు. ముందే ఇలా ఉంటే జాతర సమయంలో మరేలా ఉంటుందని విధులకు హాజరవుతున్న సిబ్బంది, అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కేవలం పోలీసు సిబ్బంది కుటుంబాలు, వారి బంధువులను మాత్రమే గద్దెల వద్దకు తీసుకెళ్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, పోలీసులు తీరు మారకుంటే జాతరలో వివాదాలు మరింత ముదిరే అవకాశాలున్నాయి.
మంత్రి ఆదేశాలు బేఖాతరు..
తల్లుల దర్శనం కోసం మేడారంలో పని చేసే అధికారులు, సిబ్బంది, మీడియా వారికి ప్రత్యేకంగా ఒక సీఐని నియమిస్తానని ఇటీవల జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో మంత్రి సీతక్క వెళ్లడించారు. కానీ అలాంటి అధికారిని ఎవరూ నియమించలేదు. దీంతో ఏ పోలీసు అధికారికి ఫోన్ చేసినా స్పందించలేని స్థితి ఉన్నట్లు తెలిపారు.
మీడియా, పూజారుల అడ్డగింత..


