రైల్వే కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
కాజీపేట రూరల్ : కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, కాజీపేట కోఆర్డినేటర్ నాయిని సదానందం డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కాజీపేట రైల్వే డీజిల్‌షెడ్, ఎలక్ట్రిక్‌షెడ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పనిభారం, ఖాళీ పోస్టుల భర్తీ , 8వ పే కమిషన్ సిఫార్సుల అమలు, సేఫ్టీ కేటగిరీ కార్మికుల రిస్క్ అలవెన్స్ తదితర డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు ఎస్.కె.జానీ, పి.వేదప్రకాశ్, జి.రాజేశ్వర్, ఎ.సత్యనారాయణ, నరేశ్‌యాద వ్, యాదగిరి, భాస్కర్‌రెడ్డి, రవికిరణ్, శివప్రసాద్, ఎం.డి.ఇబ్రహీం, బి.రవీందర్‌రెడ్డి, ఎస్.గోపి, వి.ప్రభాకర్, ఎస్.స్వర్ణకుమారి, ఆర్.ప్రజాపతి, వి.అశో క్, ఎన్.అరుణ్‌కుమార్, పి.రాజు, సీసీఎస్ డెలిగేట్లు నాగరాజు, రాజ్‌కుమార్, బి.సునీల్ పాల్గొన్నారు.
మజ్దూర్ యూనియన్ నేతలు శ్రీనివాస్, సదానందం


