ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలి

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలి

ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలి

ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలి

మేయర్‌ గుండు సుధారాణి,

కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: చెత్త సెకండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలని, సౌకర్యాలు కల్పించాలని నగర మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను మంగళవారు వారు వేర్వేరుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ హైమాస్ట్‌ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న రోడ్డు, కాంపౌండ్‌ వాల్‌ను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లోని ర్యాంపులు శుభ్రంగా ఉంచాలని కమిషనర్‌ సూచించారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తడి, పొడి చెత్తను కలిపి తీసుకురాకూడదని హెచ్చరించారు. వారి వెంట సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్‌, మహేందర్‌, సంతోష్‌ కుమార్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ నరేందర్‌, గోల్కొండ శ్రీను, భాస్కర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement