సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ తరహాలోనే తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు వర్తింపజేయాలని, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్, కేజీబీవీ టీచర్లకు మినిమం టైంస్కేల్ అమలు చేయాలని కోరారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయులకు మినిమం టైమ్‌స్కేల్ ను అమలుచేయాలన్నారు. టీఆర్‌టీఎఫ్ చీఫ్ ప్యాటర్న్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, ఉభయ రాష్ట్రాల కోకన్వీనర్ డి.విష్ణుమూర్తి, రాష్ట్ర బాధ్యులు నరేంద్రనాయక్, కుమారస్వామి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాజబాబురావు, శ్రీనివాస్‌నాయక్, కిషన్, రాజుగౌడ్, పెండెం మధుసూదన్, కె.రవీందర్, కె.శ్రీనివాస్, రమేశ్‌బాబు, వి.సత్యనారాయణ, భూక్యా కిరణ్‌నాయక్, కార్యవర్గసభ్యుడు రవీందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్


