రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
వరంగల్ లీగల్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టుకు చెందిన యువ న్యాయవాది స్వప్న హత్యకు గురవడం బాధాకరమని, పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరే స్వప్న హత్యకు ప్రధాన కారణమని వరంగల్, హనుమకొండ ఉభయ జిల్లా న్యాయవాదులు ఆ రోపించారు. న్యాయవాది స్వప్న హత్యను ఖండిస్తూ శుక్రవారం ఉభయ జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ప్రధాన గేట్ ఎదుట నిరసన తెలి పారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆస్తి పంపకాల్లో తన అన్నతో గొడవలు జరుగుతున్నాయని, ఆయన వల్ల తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఏసీపీ నుంచి ఎస్సై స్థాయి అధికారి వరకు న్యాయవాది స్వప్న ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంతోనే దుండగులు అతి దారుణంగా కత్తులతో స్వప్న గొంతు కోసి హత్య చేశారన్నారు. తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పలువురు సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులతో పాటు కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.
యువ న్యాయవాది స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం
వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదుల నిరసన


