సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Feb 27 2026 4:05 AM | Updated on Feb 27 2026 4:05 AM

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి

కాళోజీ సెంటర్‌ : గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు ఊటుకూరి అశోక్‌ ప్రభ్వుత్వాన్ని కోరారు. ఈమేరకు అదనపు కలెక్టర్‌ సంధ్యారాణిని కలెక్టరేట్‌లో కలిసి వినతి పత్రం అంజేశారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ.. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అంజేశామని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, పండిట్‌ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి సీఆర్‌టీ డైలీ వేజ్‌ వర్కర్లను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. పలుమార్లు సంబంధిత అధికారులు, గిరిజన శాఖ మంత్రికి విన్నవించినా.. ఫలితం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్‌, మనోజ్‌, ౖబైరి స్వామి, ఉమేశ్‌, కొమురయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement