breaking news
Pradeep Ranganathan
-
స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో!
'లవ్‌టుడే', 'డ్రాగన్' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 15న) స్వాగ్ ఈవెంట్ నిర్వహించారు.హీరోయిన్ జుట్టు పట్టుకుని లాగి..ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. డ్యూడ్ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్‌గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్‌ను స్టేజీపై రివర్స్ రోల్స్‌లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్లో లీనమైపోయాడు ప్రదీప్. ఇది క్యూట్‌గా లేదు అని మమిత డైలాగ్ చెప్పింది. వీళ్ల యాక్టింగ్ చూసేవారి ఫీలింగ్ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్‌గా లేదమ్మా.. ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేసింది. చదవండి: యూత్‌కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ! -
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీ SWAG ఈవెంట్ (ఫొటోలు)
-
డ్యూడ్‌లో అందమైన భావోద్వేగాలు ఉంటాయి
‘‘డ్యూడ్’ వైవిధ్యమైన ప్రేమకథ. అందమైన భావోద్వేగాలు ఉంటాయి. కీర్తీశ్వరన్గారు చెప్పిన కథకంటే 20 శాతం ఎక్కువగానే సినిమా తీశారు. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ చెప్పిన విశేషాలు. → ‘డ్యూడ్’ యూత్‌తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. చాలా కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే ‘సఖి’ లాంటి ఫ్యామిలీ మూవీ. ప్రదీప్‌గారి ‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలు తెలుగులో దాదాపు రూ. 12 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ‘డ్యూడ్’ కచ్చితంగా రూ. 15 కోట్లు వసూలు చేస్తుందని నమ్ముతున్నాం. → ‘డ్యూడ్’ని తమిళంలో ఏజీఎస్ సంస్థ ద్వారా తమిళంలో మేమే విడుదల చేస్తున్నాం. తమిళ్‌తో సమానంగా తెలుగులోనూ మా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది. → మేము హిందీలో తీసిన ‘జాట్’ మాకు మంచి వెంచర్. ‘జాట్ 2’ కూడా ఉంటుంది. ప్రభాస్‌గారితో, ఎన్టీఆర్‌గారితో మేం నిర్మిస్తున్న సినిమాలు 2026లోనే వస్తాయి. రామ్‌తో తీస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాగుంటుంది. ‘పెద్ది’ చిత్రం 2026 మార్చ్ 27న కచ్చితంగా విడుదలవుతుంది. ఆ తర్వాత సుకుమార్‌గారితో సినిమా ఉంటుంది. -
తమిళ సినిమాకు తెలుగులో క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఊహించని రికార్డ్!
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీ రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్‌లు ఓపెన్ కావడంతో ఓవర్సీస్లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్‌కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్‌కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. -
రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను: మమిత బైజు
‘‘డ్యూడ్’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్‌గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. అలా చేయడం నాకు సవాల్‌గా, ఉత్సాహంగా అనిపించింది’’ అని హీరోయిన్ మమిత బైజు తెలి పారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’లో నేను చేసిన కురల్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్ అద్భుతంగా తీశారు. ప్రదీప్ రంగనాథ్ సెట్స్‌లో చాలా హెల్ప్ ఫుల్‌గా ఉంటారు. శరత్ కుమార్‌గారి లాంటి సినియర్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్ మ్యూజిక్ మా సినిమాకి బిగ్ ఎసెట్. నవీన్ , రవిశంకర్‌గార్లు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్‌గా తీశారు. మా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
'మీ అందానికి సీక్రెట్ ఏంటని అడిగా'.. డ్రాగన్ హీరో ప్రదీప్
డ్రాగన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మరో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్గా కనిపించనుంది. వీరిద్దరు జంటగా వస్తోన్న యూత్ ఎంటర్టైనర్ డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా యూత్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు హీరో ప్రదీప్. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను పంచుకున్నారు. మొదటిసారి శరత్ కుమార్ సార్‌ను కలిసినప్పుడు మీ వయస్సు ఎంత సార్ అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. దాదాపు 71 ఏళ్ల వయసులోనూ కేవలం 40 ఏళ్ల యువకుడిలా కనిపించారని అన్నారు. ఆయనతో సార్ అసలు మీరు ఏం తింటారు? ఇంత అందంగా, యంగ్‌గా ఫిజిక్ ఉండడానికి కారణమని ఏంటని అడిగినట్లు తెలిపారు. దీనికి నేను రోజు ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగుతానని శరత్ సార్ నాతో చెప్పారని వెల్లడించారు. బీట్ రూట్ జ్యూస్ తాగితే అందంగా తయారు అవుతారేమో అనుకుని రోజు తాగేవాడినని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యపరంగానే కాకుండా.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు.కాగా.. డ్యూడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 17న థియేటర్లలో విడుదల కానుంది. -
హీరో ప్రదీప్ డేంజర్ అన్న బ్యూటీ.. బిగ్‌బాస్ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్‌బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్‌బాస్‌ల హోస్ట్లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. ప్రదీప్ చాలా డేంజర్పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి -
నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రం విడుదల కానుంది. కొద్దిరోజులుగా ప్రదీప్ రంగనాథన్ పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన తండ్రి చేస్తున్న పని గురించి కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం అతనిపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. 'మీరు హీరో మెటీరియల్‌లా లేరు.. కానీ, రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు' అంటూ ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ప్రదీప్‌కు మద్ధతుగా నిలిచారు. జర్నలిస్ట్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ సదరు జర్నలిస్ట్‌ను కోరారు.వెండితెరపై ప్రదీప్ రంగనాథ్ ఒక సాధారణ యువకుడిలా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా అంతేనని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు సరైన ఛాన్స్ కోసం ఆయన కష్టపడ్డారు. ఫైనల్‌గా విజయం సాధించారు. డబ్బు, పేరు అన్నీ ప్రదీప్‌కు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆయన కుటుంబం సాధారణ జీవితమే గడుపుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ పంచుకున్నారు.నా తండ్రి చెన్నైలో సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక జిరాక్స్ షాపు నడుపుతూనే మా కుటుంబాన్ని నాన్న పోషించారు. నాకు సినిమా ఛాన్సులతో పాటు పేరు, డబ్బు వచ్చింది. అయినప్పటికీ నాన్న మాత్రం జిరాక్స్ షాప్ నడుపుతూనే ఉన్నారు. ఎప్పటికీ మన మూలాలను మరిచిపోవద్దని ఆయన చెబుతుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులోనే షాప్‌కు వెళ్తారు.. ఒక కారు కొనిస్తానని చెప్పినా సరే దానిని తిరస్కరించారు. ఇప్పటికీ బస్సులోనే ఆయన ప్రయాణం చేస్తారు. సింపుల్‌గా ఉండటమే నాన్నకు ఇష్టం.' అని ప్రదీప్ చెప్పారు.ప్రదీప్ రంగనాథ్ తన కాలేజీ రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. కానీ, తనకు ఎక్కువ సినిమాలంటే పిచ్చి అని కూడా తెలిపారు. దీంతో తన తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందే వారని గుర్తుచేసుకున్నారు. అయితే, చదువును అశ్రద్ధ చేయనని వారికి చెప్పాను. జయం రవితో కొమలి సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత పరిశ్రమలో ఫేమ్ దక్కిందన్నారు. ఆ తర్వాత లవ్ టుడేతో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.Reacting to the "Hero Material" Controversy, #KiranAbbavaram asks the media personnel to ask him anything but be gentle about the likes of #PradeepRanganathan terming him as our Guest from Other State! pic.twitter.com/xdQ3dATvTi— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 11, 2025 -
పక్క రాష్ట్రం హీరోలను అలా కించపరచకండి: హీరో కిరణ్ అబ్బవరం
ఇటీవల డ్యూడ్ సినిమా ప్రెస్మీట్లో ఓ మహిళా జర్నలిస్ట్.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan )పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మీరు హీరోలానే ఉండరు.. రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేదా అదృష్టమా అని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు పక్కనే ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ మంచి సమాధానమే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఆ జర్నలిస్ట్‌పై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న హీరోని అలా అనడం కరెక్ట్ కాదంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా ఈ వివాదంపై తెలుగు హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) స్పందించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరస్తూ ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. సదరు మహిళా జర్నలిస్ట్ మరోసారి ప్రదీప్ రంగనాథన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చాడని చెప్పాలనుకున్నానని.. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్ చేస్తున్నారని ఆమె చెబుతూ.. ‘మీరేమంటారు?’ అని కిరణ్‌ని అడిగారు.‘నన్ను అడగండి పర్లేదు. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హీరోని అలా కించపరిచే ప్రశ్నలు అడగడం మంచిది కాదు. మీరు(మీడియా) నన్ను ఒక మాట అన్న పడతా. మనం మనం ఒకటి. కానీ పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్లను అలా కించపరచడం కరెక్ట్ కాదు. మీ లుక్స్ ఇలా ఉన్నాయని అడగడం చూసి నాకే చాలా బాధగా అనిపించింది. తప్పగా అనుకోకండి.. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి’ అని సదరు మహిళా జర్నలిస్టుకు కిరణ్ విజ్ఞప్తి చేశారు. -
డ్యూడ్ ఘనవిజయం సాధిస్తుంది – రవిశంకర్
‘‘డ్యూడ్’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మా చిత్రం ఘన విజయం సాధిస్తుంది. ఈ దీ΄ావళికి వస్తున్న ‘మిత్రమండలి, తెలుసు కదా, కె–ర్యాంప్’ చిత్రాలు కూడా విజయం సాధించాలి’’ అని నిర్మాత వై.రవిశంకర్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన ఈ చిత్రంలో వినోదం, భావోద్వేగాలతో ΄ాటు ఊహించని అంశాలుంటాయి. ‘డ్యూడ్’ కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది’’ అని చె΄్పారు. ‘‘చాలా కొత్త కథ ఇది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అన్నారు శరత్ కుమార్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమా ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు మరో మూవీతో వచ్చేస్తున్నాడు. అదే 'డ్యూడ్'. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా కీర్తిశ్వరన్ దర్శకుడు. దీపావళి కానుకగా ఈనెల 17న మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)ప్రదీప్ స్వతహాగా దర్శకుడు. కానీ హీరోగా లవ్ టుడే, డ్రాగన్ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేశాడు. 'డ్యూడ్' కూడా అదే జానర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అయితే ఈసారి కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించబోతున్నారనే విషయాన్ని ట్రైలర్‌తో చెప్పకనే చెప్పారు. ప్రదీప్-మమిత ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి అనేసరికి మమిత నో చెప్పేస్తుంది. తర్వాత ప్రదీప్.. నేహాశెట్టితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్లో కథని చెప్పి చెప్పనట్లు చూపించారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 'డ్యూడ్'తో పాటు దీపావళికి తెలుగులో మిత్రమండలి, తెలుసు కదా, కె ర్యాంప్ మూవీస్ వస్తున్నాయి. వీటితో పోటీలో మరి 'డ్యూడ్' ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
‘డ్యూడ్’ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది: హీరో ప్రదీప్ రంగనాథన్
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రెస్ మీట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డ్యూడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రిలేటబుల్ క్యారెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పని చేయడం హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది. డైరెక్టర్ ఈ కథ చెప్తున్నప్పుడే తనలోని కాన్ఫిడెన్స్ కన్వెన్షన్ చాలా నచ్చింది. తిరుపతి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాను. తిరుపతిలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది.సినిమా మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. దయచేసి పైరసీని ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను’ అన్నారు. -
రజినీకాంత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా!
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.అలా కథ చెప్పాఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రేమలుకు ముందే..ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.చదవండి: విలన్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ -
డ్యూడ్ 'సింగారి చిన్నదాని' గురించి విన్నావా?
తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టాలీవుడ్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే లవ్‌టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో మెప్పించాడు. అయితే, ఆయన తాజాగా డ్యూడ్(Dude) అనే కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు పొందిన మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తుంది. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. -
దీపావళికి డ్యూడ్
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా దీ పావళి సందర్భంగా అక్టోబరు 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘సెకండ్ గేర్ బాగుండు పో..’ పాటని శనివారం రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని సంజిత్, సాయి అభ్యంకర్ పాడారు. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. ‘సెకండ్ గేర్ బాగుండు పో..’ పాట మనసుని హత్తుకునే మెలోడీగా ఉంటుంది.వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దీ పావళికి అద్భుతమైన మ్యూజిక్‌తో కూడిన కలర్‌ఫుల్ సినిమాని అందించడానికి మా ‘డ్యూడ్’ సిద్ధంగా ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకి సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: అనిల్ యెర్నేని, కెమెరా: నికేత్ బొమ్మి. -
రోబోగా అనిరుధ్.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' గ్లింప్స్
తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. నయనతార నిర్మిస్తుండగా ఈమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించాడు. టైటిల్ విషయమై అప్పట్లో కాస్త కాంట్రవర్సీ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ పంచ్ పేరుతో ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటూనే ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)2040లో చెన్నైలో జరిగే స్టోరీతో ఈ సినిమా తీశారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమైపోయింది. ఎస్జే సూర్య విలన్. సంగీతమందించిన అనిరుధ్.. ఇదే మూవీలో కనిపించిన రోబోకు డబ్బింగ్ చెప్పడం విశేషం. అలానే సినిమాలో యష్.. మిషన్ ఇంపాజిబుల్-14లో నటించాడని, రజినీకాంత్ 189 కూడా చేస్తున్నాడని లాంటి రిఫరెన్సులు ఉన్నాయి. అలానే కొండపై హాలీవుడ్ అక్షరాలు ఉన్నట్లు ఇక్కడ కోలీవుడ్ అని ఉండటం లాంటివి డిఫరెంట్‌గా అనిపించాయి.2040లో స్వచ్ఛమైన ప్రేమని వెతికే ఓ అమ్మాయి.. హీరోని కలిస్తే తర్వాత ఏమైంది అనే కాన్సెప్ట్‌తో మూవీ తీసినట్లు ఉంది. ఇందులో ఎస్జే సూర్య గెటప్ కూడా కాస్త విచిత్రంగానే ఉంది. ప్రస్తుతానికి తమిళ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా తీసుకొస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో) -
దీపావళి బరిలో డ్రాగన్ హీరో.. మరో హిట్ కొడతాడా?
లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాల విజయంతో క్రేజీ స్టార్‌గా ఎదిగిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్తారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీకిషన్, షారా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రంలో సీమాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులోని తీమా తీమా అనే పల్లవితో సాగే తొలి పాటను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణ పొందింది. చిత్రం ఆడియోను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. అలాగే ఎల్ఐకే చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా ప్రదీప్ రంగనాథన్, విఘ్నేశ్ శివన్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
స్టైలిష్ డ్యూడ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘బూమ్ బూమ్’పాట లిరికల్ వీడియోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రదీప్, మమితా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
ప్రదీప్ రంగనాథన్ బిగ్ ప్లాన్.. మరో హిట్ గ్యారెంటీనా?
కోలీవుడ్‌లో 'కోమాలి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీలోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తనే దర్శకత్వం వహించి సూపర్‌హిట్ కొట్టారు. ఇటీవల డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని సాధించారు. ఇలా వరుసగా హీరోగా, దర్శకుడిగా విజయాలను అందుకున్న ప్రదీప్ ప్రస్తుతం విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంతో పాటు కీర్తీవాసన్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న డ్యూడ్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరో సారి ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్‌టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్‌హిట్ కొట్టిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేక కథానాయకుడిగానూ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది. -
'డ్యూడ్' టైటిల్ మాది.. ఏడాది క్రితమే రిజిస్టర్
ప్రదీప్ రంగనాథ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న సినిమాకు డ్యూడ్ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ పేరు ప్రకటించడం తనని ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసిందని హీరో-నిర్మాత-దర్శకుడైన తేజ్ అంటున్నాడు. ఏడాది నుంచి 'డ్యూడ్' సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. (ఇదీ చదవండి: నేనేం RRR లాంటి సినిమా తీయట్లేదుగా..: లోకేశ్ కనగరాజ్)మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఘర్షణ పడే ఉద్దేశ్యం తనకు లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ దృష్టికి తీసుకువెళ్లామని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తేజ్ పేర్కొన్నారు.తేజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా డ్యూడ్. తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో తీస్తున్నారు. ఫుట్ బాల్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరి టైటిల్ విషయమై ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) -
ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. విడుదలపై నయనతార ప్రకటన
ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి( Krithi Shetty) జంటగా నటిస్తున్న చిత్రం 'ఎల్ఐకే' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) విడుదలపై ప్రకటన వచ్చేసింది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో వరుస హిట్లు అందకున్న ప్రదీప రంగనాథన్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాత నయనతార (Nayanthara) ప్రకటించింది. విఘ్నేష్ శివన్( Vignesh Shivan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ దీనికి స్వరాలు అందిస్తున్నారు.భారీ బడ్జెట్‌తో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో 'ఎల్ఐకే' చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 18న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు నయనతార అధికారికంగా ప్రకటించింది. తమిళ్‌తో పాటు, తెలుగు, కన్నడ, మలయాలంలో తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ప్రేమ కోసం మొబైల్ గాడ్జెట్‌ను ఉపయోగించి 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే వ్యక్తి పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపించనున్నారు. ఇందులో ఎస్జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో ఐదుగురు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. వారిలో నయనతార ఒకరు కావడం విశేషం. జీవితానికి ఇన్సూరెన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ, ప్రేమకి ఉండే ఇన్సూరెన్స్ గురించి ఈ చిత్రంలో తెలుసుకుంటారని గతంలో దర్శకుడు తెలిపాడు. భవిష్యత్తు నేపథ్యంలో రాసుకున్న కథ కాబట్టి ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువే పడిందని ఆయన అన్నాడు. -
'డ్రాగన్' హీరో.. 'ప్రేమలు' హీరోయిన్
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషాభేదం లేకుండా పలు భాషల్లోనూ యాక్టర్స్ తెలుగులోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరేందుకు ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు రెడీ అయిపోయారు. ఇంతకీ వీళ్ల కొత్త సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) 'కోమలి' సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్.. 'లవ్ టుడే' మూవీతో అటు దర్శకత్వం చేస్తూనే హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా 'డ్రాగన్' మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇతడిని హీరోగా పెట్టి తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాని ప్రకటించారు. 'డ్యూడ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి కానుకాగ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రేమలు' మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మమిత బైజు.. డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా నటిస్తోంది. ఈ మేరకు వీళ్లిద్దరూ కలిసున్న లుక్ ని రిలీజ్ చేశారు. షర్ట్ లేకుండా ప్రదీప్ ఉండటం చూస్తుంటే ఇది కూడా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) -
ఓటీటీలో హిట్ సినిమా 'డ్రాగన్' ఎంట్రీ
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ (Return Of The Dragon) ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు, నిర్మాత అర్చనా కల్పతిలను డైరెక్టర్ శంకర్ కూడా మెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు.తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ‘లవ్‌టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ప్రదీప్ రంగనాథన్‌తో టాప్ బ్యానర్లో సినిమా.. ముగ్గురు హీరోయిన్లకు ఓకే
కోలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ఈయన కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. అందులో రెండు చిత్రాలకు ప్రదీప్ రంగనాథన్‌నే దర్శకుడు కావడం విశేషం. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. బక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. అశ్వద్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ. 150కోట్ల వరకు రాబట్టింది . కాగా ప్రస్తుతం నటుడు ప్రదీప్ రంగనాథన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'ఎల్కే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న భారీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ ప్రచారం. మహిళా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలిసింది. కాగా ఇందులో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజూ నాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటి అనూ ఇమాన్యుల్, సీరియల్ నటి ఐశ్వర్య శర్మ కూడా కథానాయికలుగా నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఓటీటీలో 'డ్రాగన్' సినిమా.. పోస్టర్ వైరల్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి నిరూపించాడు. ఆయన నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజవుతుండగా ఇంతలోనే ఓటీటీ గురించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని షోషల్‌మీడియాలో పోస్టర్ షేర్ అవుతుంది. దీంతో అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ). -
'డ్రాగన్' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ బాట పడతాయి. ఇటీవల వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) కూడా అదే కోవలోకి వస్తుంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రూ.120 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది. ముందడుగుఈ విషయాన్ని హీరో ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మార్చి 14న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిందీలో రిలీజవుతోంది. నా సినిమాలు దేశమంతటా చూడాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. నా ఆలోచనలు ఆచరణలో అమలయ్యేందుకు తొలి అడుగు పడింది. షారూఖ్ ఖాన్ సర్, సల్మాన్ ఖాన్ సర్, ఆమిర్ ఖాన్ సర్.. మీరందరూ పక్కకు జరగండి.. నేను వస్తున్నా అని సరదాగా ట్వీట్ చేశాడు.అంత పెద్దోడివైపోయావా?ఇది చూసిన నెటిజన్లు.. ఏంటి, బాలీవుడ్ హీరోలకే ధమ్కీ ఇస్తున్నావా? అంత పెద్దవాడివైపోయావా?, ఏదేమైనా హిందీలో రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసి మంచి పని చేశారు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. డ్రాగన్ సినిమా తన నిజ జీవితానికి సంబంధించిందని చిత్రదర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపాడు. సినిమాలోని ఆ బ్యాచిలర్ రూమ్ నేను నివసించిందే!'కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటాం. వాళ్లెవరో కాదు మన స్నేహితులే! డ్రాగన్ సినిమాలో చూపించే బ్యాచిలర్ రూమ్ లైఫ్ నా నిజజీవితంలోనిదే! కేవలం పాత్రలు మాత్రమే కాదు ఆ ప్లేస్ కూడా నేను నివసించిందే.. ఇగీ, పంబు, అంబు, అజయ్, కరుప్స్, బాలాజీ, జై, మురళి, జాన్, గ్లెన్, హరి, విక్కీ.. మేమంతా కాలేజీ ఫ్రెండ్స్. అందరం రూమ్ తీసుకుని ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక జీరోఇందులో కొందరు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. సినిమాలో చూపించినట్లే కాలేజ్ అయిపోయాక నేను జీరోనయ్యాను. కానీ నాలో టాలెంట్ ఉందని నమ్మి నా స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు. వాళ్లు కష్టపడి సంపాదించిన జీతంలో నుంచి ఒక్కొక్కరూ రూ.2000 చొప్పున నాకు ఇచ్చేవారు. ఆ డబ్బుతో షార్ట్ ఫిలింస్ తీశాను. ఒకసారి ఏదో పోటీలో నేను రెండో రౌండ్‌కు సెలక్ట్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో..కానీ ఫ్రెండ్స్‌ను మళ్లీ డబ్బులడగాలంటే నాకు సిగ్గుగా అనిపించింది. ఆ సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇగీ.. అతడి తల్లికి ఫోన్ చేసి అశ్వత్ పోటీలో ముందుకు వెళ్లడానికి రూ.2 వేలిస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పాడు. అది నేనెన్నటికీ మర్చిపోలేను. 8 షార్ట్ ఫిలింస్ తీశా.. నా ప్రతి అడుగులో వారు తోడున్నారు. నా ఫోన్ పగిలిపోయినప్పుడు బాలాజీ ఫోన్ కొనిచ్చాడు. ఇంత మంచి మిత్రులు నా జీవితంలో ఉన్నారు. మా గ్యాంగ్‌లో నేనే మిగిలా..నేను అందుకున్న విజయం వారి సొంతం. థాంక్యూ బాయ్స్.. ఈ రోజు మా గ్యాంగ్‌లో పంబు పెళ్లి జరిగింది. అంటే ఈ గ్యాంగ్‌లో సింగిల్‌గా మిగిలింది నేనొక్కడినే' అని రాసుకొచ్చాడు. ఇందుకు తన ఫ్రెండ్స్‌తో దిగిన పాత ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత మంచి స్నేహితులు దొరకడం నీ అదృష్టం.. నువ్వు జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ‘Return of The Dragon ‘ releasing in HINDI from MARCH 14 . Always wanted my movies to be watched by the whole of India, and here is our first step . Sharukh @iamsrk sir , Salman @BeingSalmanKhan sir , Aamir sir संभल जाओ, मैं आ रहा हूँ! 😂😂😂😂😂😂Link. :… pic.twitter.com/Lg99OWYIFn— Pradeep Ranganathan (@pradeeponelife) March 8, 2025Important post. Sometimes we fail to thank the most important people in our life because they are our friends and they won’t take it wrong !The bachelor room life that u see in ‘Dragon’ is almost 90 percent recreated from my life ! Not just the characters but also the place !… pic.twitter.com/k2Jzc64SFa— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 8, 2025చదవండి: కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి -
ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్.. దర్శకుడిపై రజనీ ప్రశంసలు!
ఏమి రైటింగ్. ఫెంటాస్టిక్. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the Dragon) ఒకటి. నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఓ మై కడవులే చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు అశ్వద్ మారిముత్తును అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా మంచి చిత్రాలను, ప్రతిభావంతులైన కళాకారులను ప్రశంసించడంలో ముందుండే నటుడు రజనీకాంత్ ఇటీవల డ్రాగన్ చిత్రాన్ని చూసి,వెంటనే ఆ చిత్రం దర్శకుడు అశ్వద్ మారిముత్తును తన ఇంటికి ఆహ్వానించి ఎంతగానో ప్రశంసించారు. ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్ అంటూ డ్రాగన్ చిత్ర కథ గురించి అభినందించారు. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వద్ మారిముత్తు తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ‘‘మంచి చిత్రాన్ని చేయాలి. దాన్ని రజనీకాంత్ చూసి ప్రశంశించాలి. ఇంటికి పిలిపించి అభినందించాలి. మా చిత్రం గురించి మాట్లాడాలి అని కష్టపడి పనిచేసే ఎందరో సహాయం దర్శకులు కలలు కంటారు. అలాంటి నా కల ఇప్పుడు నెరవేరింది ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, రజనీకాంత్‌తో ఈయన దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Rajini sir : what a writing Ashwath ! Fantastic fantastic !!🥹🥹nalla padam pannanum, padatha pathutu Rajini sir veetuku kooptu wish panni namma padatha pathi pesanum !! Ithu director aganum nu kasta patu ozhaikra ovoru assistant director oda Kanavu ! Kanavu neraveriya nal… pic.twitter.com/IFuHhNkqjY— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 5, 2025 -
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్
లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ (Return of the Dragon Movie)తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ సమాధానాలిచ్చారు. మీ పర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ స్క్రీన్‌పై చూసినప్పుడు ధనుష్‌ను కాపీ చేసినట్లు అనిపిస్తుంది. ఎవర్నీ కాపీ కొట్టట్లేదుఆ విషయాన్ని మీరు గ్రహించారా? లేదా ఎవరైనా చెప్పారా? అని ఓ పాత్రికేయుడు అడిగారు. అందుకు ప్రదీప్ ఇబ్బందిగా నవ్వుతూనే.. చాలాకాలంగా ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నానన్నాడు. కాకపోతే తానెవరినీ ఇమిటేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫిజిక్, ఫేస్‌కట్ వల్ల మీ అందరూ అలా పొరబడుతున్నారని వివరణ ఇచ్చాడు. సేమ్ ధనుష్లాగే ఉండటం మీకు ప్లస్సా? మైనస్సా అన్న ప్రశ్నకు.. అదంతా నాకు తెలియదు.. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను మాత్రమే కనపడతాను. నేను తీసిన సినిమా బాగా ఆడుతోందంటే నేను బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను అని హీరో తెలిపాడు. నా కళ్లకు ప్రదీప్లాగే ఉన్నాడు: దర్శకుడి అసహనంఇంతలో డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) మైక్ అందుకుని.. మీ కళ్లకు మాత్రమే ఫలానా హీరోలా కనిపిస్తున్నాడేమో కానీ నా కళ్లకు మాత్రం ప్రదీప్ రంగనాథన్లాగే ఉన్నాడు. కేవలం ఆయన్ను మిగతా హీరోతో పోల్చాలని మాత్రమే ఈ ప్రశ్న అడిగినట్లున్నారు. ప్రదీప్ రంగనాథన్లో నేను ఏ ఇతర హీరోను చూడలేదు అని గరమయ్యాడు. డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైంది.చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్ -
బాక్సాఫీస్ వద్ద 'డ్రాగన్'.. పది రోజుల్లోనే రికార్డ్‌స్థాయి వసూళ్లు!
లవ్ టుడే మూవీతో తెలుగు వారికి దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది.తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్‌ను షేర్ చేశారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.#Dragon crosses 100crs pic.twitter.com/RVvQetBy2u— Pradeep Ranganathan (@pradeeponelife) March 2, 2025 -
మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ!
ఒక్క సక్సెస్ కోసం పోరాడితే చాలు. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇది అందరికీ జరగకపోయినా, చాలా మంది విషయంలో జరిగేది ఇదే. నటి మమిత బైజు(Mamitha Baiju ) ఇందుకు ఒక ఉదాహరణ. ప్రేమలు అనే మలయాళం చిత్రంతో మాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించిన కథానాయకి ఈ బ్యూటీ. ఆ తరువాత మాతృభాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. అలా రెండో అవకాశమే దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదీ ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో కావడం విశేషం. ఇందులో చాలా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అదే లక్కు అనుకుంటే తాజాగా మరో క్రేజీ అవకాశం ఈమెను వరించింది. అవును దర్శకుడు, కథానాయకుడిగా వరుసగా విజయాలను అందుకుంటున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రంలో కథానాయికిగా మమిత బైజూ నటించబోతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం ద్వారా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే పూర్తి వివరాలతో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రాగన్ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి మమిత బైజు నిజంగా లక్కీనే. -
'మీ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'.. అమిర్ ఖాన్‌తో డ్రాగన్ హీరో
జీవితం ఊహించలేనిది.. ఇలా అన్నది ఎవరో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. ఈయన కోమాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టారు. ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అందురూ ఎదురు చూశారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తరువాత ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.అలా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ మై గాడ్ చిత్రం ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ నెల 21వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం వైపు పరుగులు తీస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను కలవడం ఆసక్తిగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. దీనికి ప్రదీప్ రంగనాథన్ సహ నిర్మాత కావడం గమనార్హం. అందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైత్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది గమనార్హం.ఇలాంటి పరిస్థితిలో ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను చెన్నైలో కలవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ డ్రాగన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో ఆయన్ని కలిశారా? లేక మరోదైన విషయం కోసం కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమీర్‌ఖాన్ ప్రస్తుతం నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.అదే విధంగా అనారోగ్యానికి గురైన ఆయన తల్లి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించడానికి ప్రదీప్ రంగనాథన్ వెళ్లారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా అమీర్‌ఖాన్‌తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ అందులో.. జీవితం ఊహించలేనిది అని నేను ఎప్పుడూ చెబుతాను.. మీ అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు అమిర్ ఖాన్ సార్.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాను అని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో నటిస్తున్నారు. Life is unpredictable as i always say :) Thankyou for your wonderful words #aamirkhan sir . Will cherish it for life ❤️ pic.twitter.com/HPjpJLvDN2— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న డ్రాగన్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
లవ్ టుడే మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Movie)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు 'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ప్రదీప్ రంగనాథన్. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.50.22 కోట్ల వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. #Dragon Opening pic.twitter.com/BJyckrx1FA— Pradeep Ranganathan (@pradeeponelife) February 24, 2025 -
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత ఈ సారి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Review)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. నేడు(ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ).ఎలా ఉందంటే.. 'లవ్ టుడే'తో భారీ హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. అంతకు ముందు అతనెవరేది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. అతని నుంచి మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళ్లీ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో వచ్చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కథ, కథనంలో కొత్తదనం ఏమి లేదు కానీ..ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాలేజీ సీన్స్ మొదలు క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ గత సినిమాలను గుర్తు చేస్తుంది.ఊహించినట్లుగానే కథనం సాగుతుంది.అయినా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు కథ విషయంలో కేర్ తీసుకోలేదు కానీ కథనం మాత్రం జాగ్రత్త పడ్డాడు. అల్రేడీ చూసిన కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాలేజీ ఎపిసోడ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. హీరో కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరోకి ఉద్యోగం లభించిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫేక్ సర్టిఫికేట్స్‌తో దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఓ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చోటా డ్రాగన్ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందడం కారణంగా టాలెంట్ ఉన్నవారు నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు తెరపై ఎంటర్టైనింగ్ చెప్పాడు. ఎవరెలా చేశారంటే.. రాఘవన్ అలియాస్ డ్రాగన్‌గా ప్రదీప్ రంగనాథ్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక డ్రాగన్ ప్రియురాలు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోయిన్ కయాదు లోహర్ తెరపై గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే నటనతో అంతగా స్కోప్ ఉండదు. మిస్కిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
తెలుగులో నెక్స్ట్ టాప్ హీరోయిన్ నేనే.. మీమ్ రెడీ చేసుకున్న హీరోయిన్
లవ్‌టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రం (Return of the Dragon Movie)తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్తో పాటు కయాడు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తోంది. ఫిబ్రవరి 21న విడుదలవుతున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ ప్రమోషన్స్ బాగానే చేసింది. అందులో భాగంగా హీరోహీరోయిన్లు ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడ ఓ ఆసక్తికర విషయం జరిగింది.లవ్ టుడే సీన్ రీక్రియేట్యాంకర్ మంజూష.. ప్రదీప్, కయాడు లోహర్లతో లవ్ టుడే సీన్‌ను రీక్రియేట్ చేసింది. ఇద్దరినీ ఫోన్లు మార్చుకోమంది. లోలోపల భయంగా ఉన్నా పైకి మాత్రం ఇద్దరూ సరేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఒకరి ఫోన్ మరొకరి చేతిలో పడ్డాక అసలు కథ మొదలైంది. కయాడు లోహర్ ఫోన్లో మీమ్ క్రియేషన్ యాప్ ఉందన్న విషయం బయటపెట్టాడు ప్రదీప్. దీంతో కంగుతిన్న హీరోయిన్ ఇంకా ఎక్కువ చూడొద్దని అడిగింది.తనపై తనే మీమ్ వేసుకున్న బ్యూటీకానీ ప్రదీప్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఏం మీమ్స్ ఉన్నాయో చూడాలని తహతహలాడాడు. అందులో భాగంగా ఓ మీమ్‌ను బయటపెట్టాడు. తెలుగులో నెక్స్ట్ టాప్ హీరోయిన్ కయాడు లోహర్ అని తనపై తనే మీమ్ వేసుకుందని చెప్పాడు. కయాడు ఏకంగా ప్రదీప్ వాట్సాప్ ఓపెన్ చేసింది. కేవలం నాకు మాత్రమే మీమ్స్ పంపుతానని చెప్పాడు. కానీ చూస్తే వేరే హీరోయిన్లకు కూడా పంపాడు అని చెప్పింది. దీంతో నీళ్లు నమిలిన ప్రదీప్ మమిత, అనుపమ.. ఇలా కొందరికి పంపుతూ ఉంటానని చెప్పాడు. భయపడిపోయిన హీరోఇక భయపడిపోయిన ప్రదీప్.. దీన్ని ఇంతటితో ఆపేద్దామంటూ వెంటనే ఫోన్ లాగేసుకున్నాడు. కయాడు లోహర్ తెలుగులో ఇదివరకే 'అల్లూరి' సినిమాలో నటించింది. కానీ అంత గుర్తింపు రాలేదు. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆశిస్తోంది. ఆమె కల, ప్రయత్నాలు ఏమేరకు నెరవేరతాయో చూడాలి!చదవండి: 19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు -
అలాంటి వారి మనసుల్లో నిలిచిపోతుంది: ప్రదీప్ రంగనాథన్
‘‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే మా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరి మనసుల్లో మా సినిమా నిలిచిపోతుంది. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు థ్యాంక్స్’’ అని హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) చెప్పారు.‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్పై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల అవుతోంది. తెలుగులో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల ముఖ్య అతిథులుగా హాజరై, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ–‘‘మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. మా డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఇది కేవలం యూత్ మూవీ కాదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అని అర్చనా కల్పాతి చెప్పారు. ‘‘ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై.రవి శంకర్. కయాదు లోహర్, నిర్మాత ఎస్కేఎన్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నేను హీరో అనగానే చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు: లవ్‌టుడే హీరో
లవ్ టుడే సినిమా (Love Today Movie)తో సెన్సేషన్ అయ్యాడు హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ప్రస్తుతం డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు రచయితగానూ పని చేస్తున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన డ్రాగన్ సినిమా (Dragon Movie) ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.నన్ను కిందకు లాగాలని ప్రయత్నాలుప్రదీప్ మాట్లాడుతూ.. నన్ను చాలామంది కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నారు. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను. మొక్క మానవడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే ఛాలెంజ్‌లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ లవ్ టుడే విషయానికి వస్తే.. ఈ మూవీకి హీరోయిన్ దొరకడం ఎంత కష్టమైపోయిందో! నేను హీరో అనగానే నాతో నటించేందుకు చాలామంది హీరోయిన్లు తటపటాయించారు. నేను హీరో అనగానే ముఖం మీదే..కొందరేమో డేట్స్ కుదరట్లేదంటూ ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని, పెద్ద స్టార్స్‌తో మాత్రమే నటిస్తామని చెప్పారు. వారి నిజాయితీకి థాంక్స్. కట్ చేస్తే.. ఇప్పుడు నేను డ్రాగన్ మూవీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)తో కలిసి నటించాను. కాలేజీ డేస్‌లో అనుపమ నటించిన ప్రేమమ్ సినిమా చూశాను. ఇప్పుడు తనతో కలిసి యాక్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.డ్రాగన్ రిలీజ్ ఎప్పుడంటే?డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ఓరి దేవుడా మూవీ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కేఎస్ రవికుమార్, మిస్కిన్ , వీజే సిద్ధు, హర్షత్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కానుంది.చదవండి: అంపశయ్యపై MS నారాయణ.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?: బ్రహ్మానందం -
రైజ్ ఆఫ్ డ్రాగన్!
‘లవ్ టుడే’(Love Today) మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ’. ‘ఓరి దేవుడా’ మూవీ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ రవికుమార్, మిస్కిన్ , వీజే సిద్ధు, హర్షత్ ఖాన్ , అనుపమా పరమేశ్వరన్ తదితరులు నటిస్తున్నారు. కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘రైజ్ ఆఫ్ డ్రాగన్’ అనే పాటను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను లియోన్ జేమ్స్, నదీషా థామస్ పాడారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పాటలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తో కలిసి డాన్స్ చేశారు. -
ప్రదీప్ రంగనాథన్‌తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్‌కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్‌లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్‌లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజూ'కు మరో ఛాన్స్
ఏ రంగంలోనైనా విజయమే కొలమానం. అది లేకపోతే ప్రతిభ ఉంత ఉన్నా శూన్యమే. అందుకే ఒక్క హిట్ కోసం పోరాటం చేస్తుంటారు. అలా మాలీవుడ్ యువ నటి మమితా బైజూ కోలీవుడ్ దృష్టిని తనపై తిప్పుకుంటోందనే చెప్పాలి. కేరళా కుట్టి తన 15వ ఏటనే నటిగా రంగప్రవేశం చేసింది. అంటే 2017 ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం సర్పోపరి పాలక్కారన్. ఆ చిత్రం సక్సెస్‌తో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా ఇటీవల ఆమె నటించిన 'ప్రేమలు' చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ అనువాదం అయ్యి సూపర్‌హిట్ అయ్యింది. ముఖ్యంగా 22 ఏళ్ల పరువాల బ్యూటీ మమితా బైజూ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈమె పై కోలీవుడ్ దృష్టి పడింది. అలా రెబల్ చిత్రంతో ఒక్కడ పరిచయం అయ్యింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మమితాబైజూకి అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా మరో లక్కీ ఛాన్స్‌ను ఈ కేరళా కుట్టి కొట్టేసిందని సమాచారం. ఈమె యువ నటుడు , దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాధన్, లవ్‌టుడే చిత్రంతో హీరోగానూ రంగప్రవేశం చేసి సూపర్‌హిట్ కొట్టారు. ప్రస్తుతం ఈయన ఎల్ఐసీ, డ్రాగన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి మమితా బైజూ నటించడానికి ఎంపిక అయినట్లు సమాచారం. దీనికి దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని కోడంబాక్కం వర్గాల సమాచారం. -
'లవ్ టుడే' హీరో కొత్త సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
'కోమాలి' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్.. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా మారిపోయి 'లవ్ టుడే' అనే మూవీ తీశాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. దీంతో ప్రదీప్ రంగనాథన్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తీస్తున్న 'ఎల్ఐసీ' చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఇందులో నటి నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)కాగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీని మొదలుపెట్టేశాడు. 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. 'డ్రాగన్' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. త్వరలో నటీనటుల వివరాలతో పాటు మిగతా విషయాలు చెబుతామని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)#PradeepAshwathCombo fire ah title ketta fire odave title kudukareengale 🤩! @Ags_production #KalpathiSAghoram #KalpathiSGanesh #KalpathiSSuresh are happy to present #DRAGON@pradeeponelife @Dir_Ashwath @archanakalpathi @aishkalpathi @venkat_manickam @malinavin @nikethbommi… pic.twitter.com/dOnTVhveZ1— Archana Kalpathi (@archanakalpathi) May 5, 2024 -
లవ్ టుడే హీరో మరో చిత్రం.. ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్!
నటుడు జయంరవి హీరోగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ ఆ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్‌హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థలో ప్రదీప్ రంగనాథన్ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్‌మేట్ అశ్వంత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలింస్ చేశారు. దీని గురించి ఏజీఎస్ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నటుడు ప్రదీప్ రంగనాథన్ తన కాలేజ్‌మేట్, మిత్రుడు అశ్వంత్ మారిముత్తుతో కలిసి చిత్రం చేయాలన్నది దశాబ్దం కల అని పేర్కొన్నారు. అది ఇప్పటికి నెరవేరబోతోందని అన్నారు. కాగా ఈయన ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ తరువాత ఏజీఎస్ ఎంటర్‌టైయిన్‌మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 26వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని చెప్పారు. కాగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో గోట్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. Dedicated to all those who have a dream :) Joining hands with my brother , friend , well wisher @Dir_Ashwath and my home ground @Ags_production once again ❤️#AGS26 #PR03 Announcement video : https://t.co/JwLjs8n5HI#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh pic.twitter.com/hKxBbns9TB — Pradeep Ranganathan (@pradeeponelife) April 10, 2024 -
ఎల్ఐసీ మూవీ.. కృతీ శెట్టికి తండ్రిగా నటించేదెవరో తెలుసా?
దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త సినిమా గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విఘ్నేశ్ గత ఏడాది కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఈయన దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎల్ఐసీ అని టైటిల్ ఖరారు చేశారు. ఎల్ఐసీ అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని అర్థం. లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా హీరోయిన్ కృతిశెట్టి నటిస్తుండగా నటుడు ఎస్జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, రవి వర్మన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రేమికుల మధ్య ఏర్పడే ఈగో, విడిపోవడం, మళ్లీ కలవడం వంటి అంశాలతో వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కృతి శెట్టికి తండ్రిగా ఎస్జే సూర్య, హీరోకి మిత్రుడిగా యోగి బాబు నటిస్తున్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ రెండు షెడ్యూల్లో పూర్తి చేసి 2024 సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. చదవండి: రూ.100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్‌కు ఊరట.. ఆ స్కామ్‌లో క్లీన్ చిట్ -
యంగ్ హీరోకు అక్కగా నటించనున్న నయనతార
కోలీవుడ్‌లో దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత కథానాయకుడిగా తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని సాధించడం విశేషం. ఆయన జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర విజయంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో వెంటనే కథానాయకుడు గానూ పరిచయమయ్యారు. అలా ఈయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ప్రదీప్ రంగనాథన్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అందులో ఒకటి నటుడు కమలహాసన్ నిర్మించ తలపెట్టిన చిత్రం. అయితే బడ్జెట్ అధికం కావడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో మరికొందరు నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇలాంటి సమయంలో లియో చిత్ర నిర్మాత ప్రదీప్ రంగనాథన్‌తో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. దీనికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. నటుడు అజిత్ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన విఘ్నేష్ ఆ చిత్రం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి 'ఎల్ఐసీ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. కాగా ఇందులో దర్శకుడు మిష్కిన్, ఎస్ జే సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది. కాగా ఇందులో కథానాయకిగా ఓ ప్రముఖ బాలీవుడ్ నటి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లేకపోతే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటుడు ప్రదీప్ రంగనాథన్‌కు అక్కగా ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
లవ్ టుడే హీరోతో విఘ్నేశ్ శివన్.. స్వీట్స్‌తో గుడ్‌న్యూస్..
శింబు, వరలక్ష్మి శరత్‌కుమార్ జంటగా నటించిన పోడాపొడి చిత్రంతో విఘ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత నానుమ్ రౌడీదాన్ చిత్రం చేశారు. అందులో విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేష్ శివన్, నయనతారల పరిచయం ప్రేమగా మారింది. అది సుమారు ఆరేళ్లకు ఇద్దరిని పెళ్లిపీటలు ఎక్కించింది. ఆ తరువాత విఘ్నేష్ శివన కాత్తు వాకుల రెండు కాదల్, సూర్య హీరోగా తానా సేంద కూట్టం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఇటీవల అజిత్ 62వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో నయనతార లైకా ప్రొడక్షన్స్ సంస్థలతో సంధి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె కూడా మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరిగింది. కాగా ఇటీవల నయనతార గుడ్‌టైమ్స్ ఆర్ హియర్ అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. లవ్ టుడే చిత్రం ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం(సెప్టెంబర్ 19) విఘ్నేష్ శివన్ 38వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన చైన్నెలోని ఓ జిమ్‌లో నటుడు ప్రదీప్ రంగనాథన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ డేట్స్ (ఖర్జూర పండ్లు)తో నిండిన ప్లేట్‌ను ఇవిగో నా డేట్స్ (కాల్షీట్స్) అంటూ సింబాలిక్‌గా విఘ్నేష్ శివన్‌కు అందించారు. కాగా ఇందులో నయనతార ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇకపోతే జాన్వీ కపూర్‌ను నటింపచేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. Official announcement!👀#PradeepRanganathan X #VigneshShivan X #Anirudh X #RKFI pic.twitter.com/cmVYq2N3SW — Satham Hussan (@im_Satham) September 18, 2023 చదవండి: నా బలం వెనుక ఉన్న శక్తి నువ్వే.. తల్లి ప్రేమ అంటే ఇదే! -
'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో
నటి శ్రీదేవి ఈ పేరే అందానికి బ్రాండ్ అంబాసిడర్. మొదట కోలీవుడ్‌లో బాలనాటిగా తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత టాప్ హీరోయిన్గా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి ఇండియన్ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఆమె జీవితం కథానాయకిగానే ముగిసింది. ఇక శ్రీదేవి వారసురాలిగా రంగప్రవేశం చేస్తున్న పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఇప్పటికే క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. నటన కంటే తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న జాన్వీకపూర్‌పై దక్షిణాది సినిమా చూపు చాలా కాలం క్రితమే పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు తమ చిత్రాల ద్వారా పరిచయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆమెకు దక్షిణ చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉన్నా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అలా ఇటీవలే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటించడానికి అంగీకరించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. (ఇదీ చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!) కాగా జాన్వీకపూర్ దక్షిణాదిలో తన రెండవ చిత్రాన్ని కోలీవుడ్‌లో చేయబోతున్నారని తాజా సమాచారం. కోలీవుడ్‌లో కమలహాసన్, శ్రీదేవిలది సూపర్ హిట్ కాంబో. కాగా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్‌ను కమలహాసన్ కోలీవుడ్‌లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల విక్రమ్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌న్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ‘భాగ్ సాలే’మూవీ రివ్యూ) కాగా మరోపక్క ఆయన వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. నటుడు శింబు హీరోగా ఒక చిత్రం, శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేస్తున్న కమలహాసన్, ఇటీవల చిన్నచిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'లవ్ టుడే' చిత్ర దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథం హీరోగా, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కమల్ నిర్మాతగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే నటి జాన్వీకపూర్‌ను కథానాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమల్ ఒక కీలక పాత్రలో చేయనున్నట్లు సమచారం. -
లవ్ టుడే.. వంద రోజుల్లో వందకోట్లు.. చాలామంది ఎగతాళి చేశారు
ప్రస్తుత కాలంలో సినిమాలు ఒక్క వారం థియేటర్లలో ఆడటమే గగనంగా మారింది. అలాంటిది శతదినోత్సవ వేడుకలు సాధ్యమా? అంటే లవ్ టుడే అనే చిన్న చిత్రం సాధ్యమే అని నిరూపించింది. ఏజీఎస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. నటి ఇవాని హీరోయిన్గా నటించగా సత్యరాజ్, నటి రాధికాశరత్‌కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నవంబర్ 4వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసి ఘన విజయాన్ని సాధించింది. దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి చెన్నై చెట్‌పెట్‌లోని లేడీ ఆండాళ్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై చిత్ర దర్శక, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. లవ్ టుడే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు సాధించిందన్నారు. తాను కథానాయకుడిగా నటించిన ఈ సినిమా చతికిలబడితే మళ్లీ పైకి లేవడం కష్టం అని చాలా మంది ఎగతాళి చేశారన్నారు. మరికొందరేమో ఇది ఒక కొండలాంటిదని అన్నారన్నారు. అయితే తాను ఆలోచించింది ఏమిటంటే కొండ ఎక్కడం కష్టమా? అందుకు ఏం చేయాలి? తగిన పరికరాలు, శిక్షణ, శారీరక బలం, ఆక్సిజన్ వంటివి ఉండాలి కదా. అసలు ఎక్కడానికి ఆ కొండ కావాలి కదా.. అదే లవ్ టుడే చిత్రం అన్నారు. తనపై నమ్మకంతో అవకాశాన్ని కల్పించిన చిత్ర నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. చదవండి: రెండుసార్లు బ్రేకప్.. అది బ్లాక్‌డే అంటున్న బ్యూటీ -
లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం!
ఇటీవల వచ్చిన ‘లవ్‌టుడే’ చిత్రం యూత్‌లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. తమిళ్ నటుడు, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో అనూహ్య విజయం సాధించింది. దీంతో ప్రదీప్ రంగనాథ్ పేరు తమిళంతో పాటు తెలుగులోనూ మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో తన నెక్ట్ మూవీ రజనీకాంత్‌తో చెస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్‌పై రజనీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. ఇంతకి అసలేం జరిగిందంటే. ‘లవ్‌టుడే’ మూవీ మంచి విజయం సాధించడంతో రజనీ ప్రదీప్‌ను ఇంటికి పిలిచి అభినందించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో ఇద్దరి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందనే వార్తలు గుప్పుమన్నాయి. రజనీకాంత్ 171 మూవీకి ప్రదీప్ డైరెక్టర్‌గా వ్యహరించబోతున్నాడని, దానికి జాయింట్ జగదీశన్ టైటిల్‌ను కూడా ఖరారు చేశారు నెటిజన్లు. అంతేకాదు ఈ టైటిల్‌పై మీమ్స్, పేరడీ పోస్టర్స్ వీపరీతంగా వైరల్ అయ్యాయి. ఇవి ప్రదీప్ దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో జాయింట్ జగదీశన్ అనే టైటిల్‌తో ఉన్న పేరడీ ట్వీట్‌కు ప్రదీప్ లైక్ కొట్టాడు. చదవండి: బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? ఇప్పుడు అదే అతడి కొంపముంచింది. ఆ పోస్టర్లతో టైటిల్‌తో పాటు ‘‘రజినీకాంత్ ఫ్యాన్స్ పిచ్చివాళ్లు’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో రజనీ ఫ్యాన్స్ ప్రదీప్‌పై మండిపడుతున్నారు. రజినీని, రజినీ ఫ్యాన్స్‌ను కించపరిచే విధంగా ఉన్న పోస్టుకు లైక్ ఎలా కొడతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు వరుస పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వివాదంపై ప్రదీప్ ఇంకా స్పందించలేదు. కాగా గతంలో కూడా రజనీ ఫ్యాన్స్ ప్రదీప్‌పై మండిపడ్డారు. ఆయన నటించని తమిళ చిత్రం కోమలిలో రజనీకాంత్ పోలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావించి ఫ్యాన్స్ ఆగ్రహనికి గురయ్యాడు. దీనికి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది. ரஜினி இன்னைக்கும் Box-office assualt Industry hit கொடுக்க முடியும்ன்ற பயத்துலயே விஜய் பேன்ஸ் வாழ்றாங்க ரஜினி பத்தின பேச்சு இருக்குற வரை அவரே ராஜா,இப்போவா நடக்குது 1980s இருந்து 😂🔥 https://t.co/Em3AA9Hoz0 — . (@Fine_tweete) February 2, 2023 -
'లవ్‌టుడే' డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్?
తమిళసినిమా: రజనీకాంత్ 171వ చిత్రం నుంచి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది ఆయన చేస్తున్న 169వ చిత్రం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రజనీకాంత్ తదుపరి మరో రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అందులో లాల్ సలాం అనేది ఒకటి. దీనికి కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇకపోతే 171వ చిత్రం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీనికి డాన్ చిత్రం ఫేమ్ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. సడన్‌గా ప్రదీప్ రంగనాథన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటింన లవ్ టుడే చిత్రం అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ ప్రదీప్రంగనాథన్ను ఎంతగానో ప్రశంసించారు. విను చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్‌కు అంతగా రుచించలేదని, దీంతో ప్రదీప్ రంగనాథన్ తన 171వ చిత్రానికి దర్శకత్వం వహించేలా ప్రచారం జరుగుతోంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ రెండు చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడం మరో విశేషం. -
ఓటీటీకి వచ్చేస్తున్న లవ్‌టుడే చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కంటెంట్ బావుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. ఈ కోవలోకే వస్తుంది లవ్‌టుడే సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 5కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ. 60కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేశారు. గతనెల 25న విడుదలైన ఈ చిత్రం ఇక్కడా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రదీప్, ఇవానాల నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే లవ్‌టుడే తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లవ్‌టుడే డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. -
ఓటీటీలోకి ‘లవ్ టుడే’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?
తమిళ్ బ్లాక్ బస్టర్ ‘కోమలి’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ టుడే’. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ్లో చరిత్ర సృష్టించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకొచ్చారు. నవంబర్ 25న టాలీవుడ్లో విడుదలైన ఈచిత్రానికి.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే 2.35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. థియేటర్స్‌లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా.. అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
నన్ను హీరో ధనుష్‌తో పోల్చడం సరైంది కాదు : లవ్ టుడే హీరో
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’. ఇందులో ఇవాన హీరోయిన్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు ఈ నెల 25న విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘2019లో దర్శకుడిగా నాకు ‘కోమలి’ సినిమా చేసే చాన్స్ వచ్చింది. ‘జయం’ రవిగారు హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి స్పందన లభింంది. ఆ తర్వాత మూడేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసి ‘లవ్ టుడే’ తీశాం. నేను 2007లో ‘అప్(ప్పా) చేసిన షార్ట్ ఫిల్మ్‌నే ‘లవ్ టుడే’ సినిమాగా తీశాం. మొబైల్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ చిత్రం హిట్ అవుతుందని ఊహించాను. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ‘లవ్ టుడే’ ప్రిమియర్ ఇంట్రవెల్ సమయంలో ‘దిల్’ రాజుగారు ఈ సినిమా సపర్‌హిట్ అన్నారు. అదే జరిగింది. నన్ను అందర ధనుష్‌తో పోల్చుతున్నారంటే నేను సన్నగా ఉండటం వల్ల కాబోలు. ఆయనతో పోల్చడం హ్యాపీగా ఉన్నప్పటికీ అంత అద్భుతమైన నటుడితో నాకు పోలిక పెట్టడం సరైంది కాదనిపిస్తోంది’’ అన్నారు. ‘‘లవ్ టుడే’కి మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఇవాన. -
అందుకే డబ్ చేశాం
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్గా, రవీనా కీలక పాత్రలో నటించారు. ఈ నెల 4న తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాను అదే టైటిల్‌తో ‘దిల్’ రాజు తెలుగులో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ‘లవ్ టుడే’ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, నటి రాధికా శరత్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా విడుదలైన ‘లవ్ టుడే’ యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తమిళ ట్రైలర్ చూసి రీమేక్ ఆలోచన వచ్చింది. కానీ మ్యాజిక్ మిస్సవుతుందేమోనని తెలుగులో డబ్ చేశాం’’ అన్నారు. ‘‘తమిళంలోలానే ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు ప్రదీప్. -
హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్
ప్రతిభను చాటు ఫలితం అదే వస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. అలా ఆలస్యంగా శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. యువ నటి ఇవనా ప్రస్తుతం అలాంటి విజయాన్ని అనుభవిస్తోంది. ఈ మలయాలి కుట్టి తన 12వ ఏట నుంచే సినిమాల్లో నటించడం మొదలెట్టింది. మొదట్లో కొన్ని మలయాళ చిత్రాల్లో నటించిన ఇవనా 2018లో బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన నాచియార్ చిత్రంలో ఈమె కీలక పాత్ర ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చదవండి: అల్లు అర్జున్ గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న కేరళ కలెక్టర్ ఆ చిత్రంలో నటిగా మంచి ప్రశంసలు అందుకున్న ఈమె ఆ తర్వాత హీరో తదితర చిత్రాల్లో నాయకిగా నటించింది. తాజాగా ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన లవ్ టుడే చిత్రంలో కథానాయకిగా నటించింది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి అఘోరం నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై విశేష ప్రేక్షకాదరణతో పొందుతోంది. కాగా ఇందులో నటి ఇవనా హీరో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పడక గదిలో చాలా సన్నిహితంగా నటించిన సన్నివేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. మూవీ సక్సెస్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె దీనిపై స్పందించింది. చదవండి: రజనీకి థ్యాంక్స్ చెప్పిన అలనాటి హీరోయిన్ రాధ, ట్వీట్ వైరల్ ‘నాకు దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశం గురించి నా తల్లిదండ్రులతో చర్చించాను. అందుకు వారు కథకు అవసరమైతే నటించడంలో తప్పు లేదని చెప్పారు. నటించే ముందు నేను కూడా భయపడ్డాను. కానీ సెట్లో ఆ సీన్లో నటిస్తున్నప్పుడు నేను భావించిన దానికంటే పూర్తి భిన్నంగా ఉంది. అందులో ఎలాంటి అశ్లీలత లేకుండా చిత్రీకరించారు. మూవీ చూసిన తర్వాత నా తల్లిదండ్రులు గానీ, స్నేహితులు కానీ ఎలాంటి విమర్శలను వ్యక్తం చేయలేదు’ చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి సన్నివేశం ద్వారా ప్రేక్షకులకు మంచి సందేశం ఉంటుందనే ఉద్దేశంతోనే తాను ఈ సీన్లో నటించడానికి మరో కారణం అని ఇవనా పేర్కొంది. -
హీరోగా మారుతున్న మరో దర్శకుడు
హీరోలు దర్శకులుగా చేయడం, దర్శకులు హీరోలుగా మారడం చిత్ర పరిశ్రమలో సాధారణంగా జరిగేదే. తాజాగా కోలీవుడ్‌లో మరో దర్శకుడు కథానాయకుడిగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. జయం రవి, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన కోమాళి వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా హీరోగా చేయనున్నాడు. ఏజేఎస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వ బాధ్యతలనూ నిర్వహించనున్నాడు. ఈ విషయాన్ని ఆసంస్థ అధినేతలు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. -
కోమాలి దర్శకుడితో విక్రమ్
నటుడు విక్రమ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు పొందిన నటుడు విక్రమ్. పాత్ర కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. ప్రయోగాలు చేయడానికి ముందే విక్రమ్ అలా ఇటీవల నటించిన కడారం కొండాన్ చిత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో తన కొత్త చిత్రాల విషయంలో విక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్‌లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నారు. అంతకు ముందు ఇమైకా నొడిగళ్ చిత్రం ఫేం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించనున్నట్లు ఇటీవల తెలిపారు. కాగా తాజాగా అంత కంటే ముందు యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. జయం రవి హీరోగా రంగనాథన్ తెరకెక్కించిన కోమాలి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో చిత్ర నిర్మాత ఐసరి గణేశ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. అంతే కాదు తన సంస్థలో తదుపరి చిత్రానికి ఆయన్నే దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ చిత్రంలోనే నటుడు విక్రమ్ హీరోగా నటించనున్నారనేది తాజా సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా విక్రమ్ ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాల్లో కర్ణన్ అనే పౌరాణిక ఇతిహాస కథా చిత్రం ఉంది. ఇది తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున రూపొందనుంది. ప్రదీప్ రంగనాథన్, అజయ్ జ్ఞానముత్తు, మణిరత్నం చిత్రాలను పూర్తి చేసిన తరువాత కర్ణన్ చిత్రంలో నటించనున్నారు. -
దొంగతనానికి రెండో'సారి'
ఒకే ఇంట్లో రెండు సార్లు దొంగ తనం చేశాడు. అంతేకాదు.. గోడ మీద.. తన దొంగ తనానిక గుర్తుగా.. సారీ అంటూ స్కెచ్ పెన్ తో రాశాడో వింత దొంగ.. కన్నం వేసిన ఇంటికే మరో సారి వెళ్లి... రెండో సారీ రాశాడు.. ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకు వెళ్లాడు. గోడమీద మరో 'సారీ' కూడా చెప్పెళ్లాడు.. పోలీసులకే సవాల్ విసిరిన ఈ చోరీ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని బీఎన్‌రెడ్డి కాలనీ ప్లాట్నెం 36లో వ్యాపారి ప్రదీప్ రంగనాధన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంటిలో గత నెల 31వ తేదీన ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లోని బీరువాలో ఉన్న అమెరికన్ డాలర్లు, బంగారు ఆభరణాలు, కెమెరాలు, ఐఫోన్లు తస్కరించాడు. ఈ దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెబుతూ గోడపై స్కెచ్‌పెన్‌తో 'సారీ' అంటూ రాసి పరారయ్యాడు దొంగ.అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం, క్రైం పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. ఒక వైపు ఈ దర్యాప్తు జరుగుతుండగానే బుధవారం రాత్రి సదరు దొంగ మరోసారి ఇంట్లోకి ప్రవేశించి విలువైన ఆభరణాలతో పాటు లాకెట్, రూ.6వేల నగదు ఎత్తుకెళ్లాడు. మొదటిసారి ఎక్కడైతే సారీ అని రాశాడో సరిగ్గా అదే ప్రాంతంలో మరోసారి 'సారీ' అంటూ రాసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైం పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను సరిచూడగా రెండుసార్లు వచ్చింది ఓకే వ్యక్తి అని తేలింది. ఈ వింత పరిస్థితికి ఎలా రియాక్ట్ కావాలో ఇంటివారికి అర్ధం కావడంలేదు..ఒకే ఇంట్లో మూడు వారాల వ్యవధిలో ఒకే దొంగ చోరీకి పాల్పడడంతో పాటు సారీ అంటూ రాయడంతో పోలీసులు వింత దొంగకోసం గాలింపు చేపట్టారు.