లవ్‌ టుడే హీరోతో విఘ్నేశ్‌ శివన్‌.. స్వీట్స్‌తో గుడ్‌న్యూస్‌.. | Vignesh Shivan To Direct Pradeep Ranganathan - Sakshi
Sakshi News home page

Vignesh Shivan: విఘ్నేశ్‌ డైరెక్షన్‌లో నయనతార.. లవ్‌ టుడే హీరోతో..

Sep 20 2023 1:55 PM | Updated on Sep 20 2023 2:38 PM

Vignesh Shivan to Direct Pradeep Ranganathan - Sakshi

తాజాగా తన భర్త విఘ్నేష్‌ శివన్‌ కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. లవ్‌ టుడే చిత్రం ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథ్‌ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహించను

శింబు, వరలక్ష్మి శరత్‌కుమార్‌ జంటగా నటించిన పోడాపొడి చిత్రంతో విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రం చేశారు. అందులో విజయ్‌ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ చిత్ర షూటింగ్‌ సమయంలోనే విఘ్నేష్‌ శివన్‌, నయనతారల పరిచయం ప్రేమగా మారింది. అది సుమారు ఆరేళ్లకు ఇద్దరిని పెళ్లిపీటలు ఎక్కించింది.

ఆ తరువాత విఘ్నేష్‌ శివన కాత్తు వాకుల రెండు కాదల్‌, సూర్య హీరోగా తానా సేంద కూట్టం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఇటీవల అజిత్‌ 62వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో నయనతార లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలతో సంధి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె కూడా మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరిగింది.

కాగా ఇటీవల నయనతార గుడ్‌టైమ్స్‌ ఆర్‌ హియర్‌ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తాజాగా తన భర్త విఘ్నేష్‌ శివన్‌ కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. లవ్‌ టుడే చిత్రం ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథ్‌ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం(సెప్టెంబర్‌ 19) విఘ్నేష్‌ శివన్‌ 38వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన చైన్నెలోని ఓ జిమ్‌లో నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ప్రదీప్‌ రంగనాథన్‌ డేట్స్‌ (ఖర్జూర పండ్లు)తో నిండిన ప్లేట్‌ను ఇవిగో నా డేట్స్‌ (కాల్‌షీట్స్‌) అంటూ సింబాలిక్‌గా విఘ్నేష్‌ శివన్‌కు అందించారు. కాగా ఇందులో నయనతార ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇకపోతే జాన్వీ కపూర్‌ను నటింపచేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చదవండి: నా బలం వెనుక ఉన్న శక్తి నువ్వే.. తల్లి ప్రేమ అంటే ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement