Love Today-Pradeep Ranganathan: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం! ట్వీట్‌కి లైక్‌ కొడతావా? అంటూ ఫైర్‌

Rajinikanth Fans Fires On Love Today Fame Pradeep Ranganathan - Sakshi

ఇటీవల వచ్చిన ‘లవ్‌టుడే’ చిత్రం యూత్‌లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. తమిళ్‌ నటుడు, డైరెక్టర్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్‌, తెలుగులో అనూహ్య విజయం సాధించింది. దీంతో ప్రదీప్‌ రంగనాథ్‌ పేరు తమిళంతో పాటు తెలుగులోనూ మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో తన నెక్ట్‌ మూవీ రజనీకాంత్‌తో చెస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, మీమ్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ రంగనాథన్‌పై రజనీ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..

ఇంతకి అసలేం జరిగిందంటే. ‘లవ్‌టుడే’ మూవీ మంచి విజయం సాధించడంతో రజనీ ప్రదీప్‌ను ఇంటికి పిలిచి అభినందించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో ఇద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతోందనే వార్తలు గుప్పుమన్నాయి. రజనీకాంత్‌ 171 మూవీకి ప్రదీప్‌ డైరెక్టర్‌గా వ్యహరించబోతున్నాడని, దానికి జాయింట్‌ జగదీశన్‌ టైటిల్‌ను కూడా ఖరారు చేశారు నెటిజన్లు. అంతేకాదు ఈ టైటిల్‌పై మీమ్స్‌, పేరడీ పోస్టర్స్‌ వీపరీతంగా వైరల్‌ అయ్యాయి. ఇవి ప్రదీప్‌ దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో జాయింట్‌ జగదీశన్‌ అనే టైటిల్‌తో ఉన్న పేరడీ ట్వీట్‌కు ప్రదీప్‌ లైక్‌ కొట్టాడు. 

చదవండి: బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?

ఇప్పుడు అదే అతడి కొంపముంచింది. ఆ పోస్టర్లతో టైటిల్‌తో పాటు ‘‘రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ పిచ్చివాళ్లు’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో రజనీ ఫ్యాన్స్‌ ప్రదీప్‌పై మండిపడుతున్నారు. రజినీని, రజినీ ఫ్యాన్స్‌ను కించపరిచే విధంగా ఉన్న పోస్టుకు లైక్‌ ఎలా కొడతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ మేరకు వరుస పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వివాదంపై ప్రదీప్‌ ఇంకా స్పందించలేదు. కాగా గతంలో కూడా రజనీ ఫ్యాన్స్‌ ప్రదీప్‌పై మండిపడ్డారు. ఆయన నటించని తమిళ చిత్రం కోమలిలో రజనీకాంత్‌ పోలిటికల్‌ ఎంట్రీ గురించి ప్రస్తావించి ఫ్యాన్స్‌ ఆగ్రహనికి గురయ్యాడు. దీనికి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top