ప్రదీప్‌ రంగనాథన్‌తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్‌ | Pradeep Ranganathan Next Movie Plan With Two Heroines, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ప్రదీప్‌ రంగనాథన్‌తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్‌

Jun 9 2024 6:51 AM | Updated on Jun 9 2024 3:02 PM

Pradeep Ranganathan Next Movie Plan With Two Heroines

ఏ రంగంలోనైనా లక్‌ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్‌ రంగనాథన్‌కు లక్‌ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్‌ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. 

ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్‌ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్‌ రంగనాథన్‌ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్‌. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి కాకముందే అశ్వంత్‌ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్‌ అనే చిత్రంలో నటించడానికి కమిట్‌ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. 

ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్‌ హీరోయిన్లు రొమాన్స్‌ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్‌, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్‌ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్‌ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్‌ చిత్ర సక్సెస్‌ జోష్‌లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్‌ క్రేజ్‌లో ఉన్నారు. డ్రాగన్‌ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ రెండో షె డ్యూల్‌ త్వరలో చైన్నె, హైదరాబాద్‌ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement