Love Today Telugu Movie OTT Release Date, Platform Confirmed - Sakshi
Sakshi News home page

Love Today OTT Release Date : 'లవ్‌టుడే' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Dec 17 2022 11:28 AM | Updated on Dec 17 2022 3:29 PM

Love Today Telugu OTT Release Date Locked - Sakshi

కంటెంట్‌ బావుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. ఈ కోవలోకే వస్తుంది లవ్‌టుడే సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం తమిళనాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 5కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ. 60కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను డబ్‌ చేశారు.

గతనెల 25న విడుదలైన ఈ చిత్రం ఇక్కడా సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రదీప్‌, ఇవానాల నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే లవ్‌టుడే తెలుగు వెర్షన్‌ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ లవ్‌టుడే డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 25న క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement