రైజ్‌ ఆఫ్‌ డ్రాగన్‌! | Pradeep Ranganathan Return of the Dragon song Release | Sakshi
Sakshi News home page

రైజ్‌ ఆఫ్‌ డ్రాగన్‌!

Jan 4 2025 12:18 AM | Updated on Jan 4 2025 12:18 AM

Pradeep Ranganathan Return of the Dragon song Release

‘లవ్‌ టుడే’(Love Today) మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ప్రదీప్‌ రంగనాథన్‌(Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్ ’. ‘ఓరి దేవుడా’ మూవీ ఫేమ్‌ అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్‌ రవికుమార్, మిస్కిన్ , వీజే సిద్ధు, హర్షత్‌ ఖాన్ , అనుపమా పరమేశ్వరన్  తదితరులు నటిస్తున్నారు. కల్పాతి ఎస్‌. అఘోరం, కల్పాతి ఎస్‌. గణేశ్, కల్పాతి ఎస్‌. సురేష్‌ నిర్మిస్తున్నారు. 

లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘రైజ్‌ ఆఫ్‌ డ్రాగన్‌’ అనే పాటను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను లియోన్‌ జేమ్స్, నదీషా థామస్‌ పాడారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఈ పాటలో ప్రదీప్‌ రంగనాథన్ (Pradeep Ranganathan) తో కలిసి డాన్స్  చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement