స్టైలిష్‌ డ్యూడ్‌ | Pradeep Ranganathan Dude to release on Diwali 2025 | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ డ్యూడ్‌

Aug 24 2025 4:21 AM | Updated on Aug 24 2025 4:21 AM

Pradeep Ranganathan Dude to release on Diwali 2025

ప్రదీప్‌ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ సినిమా ‘డ్యూడ్‌’. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘బూమ్‌ బూమ్‌’పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 28న రిలీజ్‌ చేయనున్నట్లుగా వెల్లడించి, పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో ప్రదీప్, మమితా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement