
లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాల విజయంతో క్రేజీ స్టార్‌గా ఎదిగిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ఎల్‌ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్తారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, యోగిబాబు, గౌరీకిషన్, షారా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో సీమాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులోని తీమా తీమా అనే పల్లవితో సాగే తొలి పాటను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణ పొందింది. చిత్రం ఆడియోను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. అలాగే ఎల్‌ఐకే చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా ప్రదీప్ రంగనాథన్, విఘ్నేశ్ శివన్, అనిరుధ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.