ఎల్లమ్మలో..?  | Mamitha Baiju is in talks to play the female lead in Yellamma | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మలో..? 

May 29 2026 6:01 AM | Updated on May 29 2026 6:01 AM

Mamitha Baiju is in talks to play the female lead in Yellamma

‘ఎల్లమ్మ’ చిత్రంలో భాగం కానున్నారట యువ హీరోయిన్‌ మమితా బైజు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘బలగం’ ఫేమ్‌ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర చేయనున్నారని తొలుత  కీర్తీ సురేష్‌ పేరు వినిపించింది.

 కానీ ఆమె భాగం కాలేదు. ఆ తర్వాత మృణాల్‌ ఠాకూర్‌తో ‘ఎల్లమ్మ’ టీమ్‌ చర్చలు జరిపారనే టాక్‌ వినిపించింది. అయితే మృణాల్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. తాజాగా యంగ్‌ హీరోయిన్‌ మమితా బైజుతో ‘ఎల్లమ్మ’ సినిమా మేకర్స్‌ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి... ‘ఎల్లమ్మ’ చిత్రంలో మమితా బైజు ఫైనల్‌ అవుతారా? లేక మరో హీరోయిన్‌ పేరు ఏమైనా వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement